టాలీవుడ్ ఇండస్ట్రీలో హ్యాంద్ సమ్ హీరో అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మహేష్ బాబు . వయసు పెరిగే కొద్ది ఆయనతోపాటు అందం కూడా పెరిగిపోతూ వస్తుంది అంటుంటారు జనాలు . ఇప్పటికీ ఓ యంగ్ హీరోని పక్కనపెట్టి మహేష్ బాబుని పక్కన పెడితే మహేష్ బాబునే యంగ్ గా ఉన్నారు అంటారు . అంత ఎందుకు చాలామంది హీరోయిన్స్ అయితే మహేష్ ఫుడ్ ఏం తింటాడో..? అస్సలు అర్థం కావడం లేదు ..రోజు రోజుకి ఇంత అందంగా తయారైపోతున్నాడు అని ఓపెన్ గా చెప్పినా జనాలు ఉన్నారు.
రీసెంట్గా మహేష్ బాబు కి సంబంధించిన మరో అందమైన సీక్రెట్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది. టీనేజీ వైబ్స్ ని మెయింటైన్ చేస్తూ అమ్మాయిలను కట్టిపడే మహేష్ బాబు ఫార్ములా ఇదే అంటూ ప్రచారం చేస్తున్నారు జనాలు . కాగా నట్స్ తో తయారు చేసిన ఓట్ మీల్ మహేష్ బాబు డైలీ ఉదయం అల్పాహారంగా తీసుకుంటూ ఉంటాడట . రాత్రిపూట నానపెట్టిన గింజలతో డిన్నర్ ఫినిష్ చేస్తాడట.
నేచురల్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తింటూ ఉంటాడట . అందుకే మహేష్ బాబు ఇంత అందంగా ఇంత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు అంటున్నారు జనాలు . అంతేకాదు మహేష్ బాబు ప్రతి ఫుడ్ తింటాడు కానీ తిన్నది ఏదైనా లిమిట్ లోనే తింటాడు. డైరీ ప్రొడక్ట్స్ – చాక్లెట్స్ – సాఫ్ట్ డ్రింక్స్ – జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఏవి తినడట. ఓన్లీ వెజిటేబుల్స్.. ఫ్రూట్స్ మాత్రమే మహేష్ బాబు ఆరగిస్తాడట . అందుకే మహేష్ బాబు ఇంత అందంగా ఉన్నాడు అంటున్నారు జనాలు . మరెందుకు ఆలస్యం మహేష్ బాబు లాంటి హ్యాండ్ సమ్ లుక్స్ కావాలంటే మీరు ఇలా చేయండి..!!