టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా తెరకెక్కుతోన్న సినిమా ఓజీ. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ పేరునే షార్ట్ కట్‌లో ఓజీగా పెట్టినట్టు టాక్ ? సాహో తర్వాత యంగ్ , డైనమిక్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. దాదాపు 50 శాతంకు పైగా షూటింగ్ పూర్తయినట్టు మేకర్స్ చెపుతున్నారు. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ సినిమాను ఈ డిసెంబర్ మూడో వారంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ముందు నుంచి చెపుతున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ఏంటనేది ముందు నుంచి అందరిలోనూ పెద్ద ఆసక్తిగా మారింది. సినిమా మేకర్స్ స్టార్టింగ్‌లోనే కొన్ని పవర్ ఫుల్ ట్యాగ్‌లు రివీల్ చేశారు. “ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్”, “దే కాల్ హిమ్ ఓజి” అంటూ ట్యాగ్స్ నిన్న మొన్నటి వరకు బాగా వైరల్ కావడంతో పాటు హైలెట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ రెండు ట్యాగ్స్‌లో ఒకటి ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది. ఓజీ అనేది మెయిన్ టైటిల్ కాగా... “దే కాల్ హిమ్ ఓజి” అనే క్యాప్షన్ కింద లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు త్రిబుల్ ఆర్ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ట్విస్ట్: పవన్ కళ్యాణ్ ‘ OG ‘ టైటిల్ మార్చేశారా… కొత్త టైటిల్ ఇదే…!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి