Movies" అప్పుడు లవర్..ఇప్పుడు సిస్టర్"..తమన్నా పై తెలుగు హీరో కామెంట్స్ వైరల్..!!

” అప్పుడు లవర్..ఇప్పుడు సిస్టర్”..తమన్నా పై తెలుగు హీరో కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు కాంబోలు ఎలా సెట్ అవుతాయో అర్థం కాదు . ఒకసారి హీరోయిన్గా నటించిన అమ్మాయితో మరోసారి చెల్లి పాత్ర చేయాల్సి వస్తూ ఉంటుంది . ప్రజెంట్ అలాంటి టఫ్ సిట్యుయేషన్ ఫేస్ చేశాడు టాలీవుడ్ యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో సుశాంత్ . అక్కినేని ఫ్యామిలీ ని ఉపయోగించుకొని ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ కాళిదాసు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తర్వాత పలు సినిమాలో నటించిన పెద్దగా క్రేజ్ గుర్తింపు దక్కలేదు . ఈ క్రమంలోని ఆయన ఇండస్ట్రీలో సైట్ క్యారెక్టర్లు చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంలో ఓ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరు మెయిన్ లీడ్ లో నటిస్తూ ఉండగా తమన్న ఆయనకు జోడిగా నటిస్తుంది. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించబోతుంది .

ఈ సినిమాలో హీరో సుశాంత్ క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్ కి సంబంధించి అంటూ ఓ న్యూస్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుశాంత్ మాట్లాడుతూ :మెగాస్టార్ తో పనిచేయాలి అనేది నా చిన్నప్పటి నుంచి కోరిక . ఫైనల్ అది తీరిపోయింది ఆయన మూవీస్ చూస్తూనే పెరిగాను. ఆయన డ్యాన్ అంటే చాలా చాలా ఇష్టం ..ఇంతకంటే ఇప్పుడు నాకు ఏం కావాలి” అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు హీరోయిన్ తమన్నా పై కామెంట్స్ చేస్తూ “ఒకప్పుడు నేను ఎంట్రీ ఇచ్చిన సినిమాలో ఆమె హీరోయిన్ . కాళిదాసు చిత్రంలో నా లవర్ ..ఇప్పుడు ఈ మూవీలో నా సిస్టర్ “అంటూ చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారి గా నవ్వేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news