Movies"నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది".. ఫ్యాన్స్ కు బిగ్ షాకిచ్చిన రష్మిక...

“నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది”.. ఫ్యాన్స్ కు బిగ్ షాకిచ్చిన రష్మిక .. భర్త పేరును కూడా రివీల్ చేసేసిందే..!!

ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు.. ఎలా స్వీట్ షాక్ ఇస్తున్నారో అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొంతమంది చెప్పకుండా పెళ్లిళ్లు చేసుకుంటే.. మరి కొందరు చెప్పకుండానే ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా దాచి పెట్టేస్తున్నారు. అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది రష్మిక మందన్నా. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన్నా కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో .

కాగా రీసెంట్గా ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతున్నా సరే .. ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ మాత్రం ఏ విధంగా తగ్గడం లేదు . దాని అంతటికి కారణం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడమే అంటూ తెలుస్తుంది. కాగా సరికొత్త కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకునే రష్మిక మందన్నా.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీగా నటిస్తుంది . ఈ క్రమంలోనే కొన్ని రోజులు ముందు ఓ ప్రమోషనల్ ఈవెంట్ కి వెళ్ళిన ఆమె తన పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఈ క్రమంలోనే హోస్ట్ సరదాగా అడిగిన ప్రశ్నలకు ..”నాకు నరుటోతో ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ..నా మనసులో అతడే ఉన్నాడు” అంటూ రష్మిక ఫన్నీ కామెంట్స్ చేసింది. దీంతో జనాలు సైతం షాక్ అయిపోయారు . నరుటో అంటే ఎవరో తెలియని వాళ్ళు ఎవరు ఆ నరుటో అంటూ ఆరా తీయ్యడం మొదలుపెట్టారు . అయితే నరుటో అనేది ఎవరో కాదు ఫేమస్ అయిన ఎనిమి సిరీస్ లో ఒక పాత్ర పేరు . కేవలం రష్మిక మందన్నానే కాదు చాలామంది ఈ పాత్రకు ఫ్యాన్స్ ఉన్నారు . వాళ్ళల్లో ఒకరుగా రష్మిక మిగిలిపోయింది. ఇప్పుడు ఆమె నరుటో గురించి మాట్లాడడం ఇంట్రెస్టింగ్ గా మారింది . అయితే జనాలు మాత్రం ఈమె నాకు పెళ్లయిపోయింది అని చెప్పడంతో ఒక్కసారి గుండె ఆగిపోయినంత పని అయింది . ఆ తర్వాత మ్యాటర్ తెలుసుకొని రిలాక్స్ అవుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news