సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుకలకు సర్వం సిద్ధమవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15 , 16వ తేదీల్లో సైమా అవార్డ్స్ ను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది . అంతేకాదు ఈసారి ఎన్నడూ లేని విధంగా తెలుగు నుంచి అత్యధిక కేటగిరీలో నామినేట్ అయినట్లు తెలుస్తుంది .
మరి ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ఎక్కువ కేటగిరిలో నామినేట్ అయ్యి రికార్డు సృష్టించింది. బ్లాక్ బస్టర్ మూవీ గా టాలీవుడ్ చరిత్రను తిరగ రాసిన ఆర్ఆర్ఆర్. ఏకంగా ఇండియాకు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఫస్ట్ టైం సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో 14 క్యాటగిరిలో నమోదైన తెలుగు సినిమాగా రికార్డులను క్రియేట్ చేసింది .
ఆ తర్వాత ఎక్కువ కేటగిరి లో నామినేట్ అయిన సినిమా సీతారామం నిలిచింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. రష్మిక మందన కీలకపాత్రలో నటించింది . సినిమా కథని తిరగరాసింది మృణాల ఠాకూర్ అనే చెప్పాలి. దుబాయ్ లోని డి డబ్ల్యూ టి సి లో సైమా వేడుకను ఘనంగా నిర్వహించడానికి మేకర్ సర్వం సిద్ధం చేశారు . ఉత్తమ చిత్రం క్యాటగిరిలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ..సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు.. నిఖిల్ మిస్టర్ అడ్వెంచర్ ఫిలిం కార్తికేయ.. అడవి శేషు మేజర్ లతో పాటు డీసెంట్ బ్లాక్ బస్టర్ సీతారామం కూడా పోటీ పడుతున్నాయి .
ఇక ఈసారి అన్ని భాషల నుంచి పోటీ గట్టిగానే ఉంది. ప్రతీ భాషలో భారీ సినిమాలు.. ఆడియన్స్ ను ఆకట్టుకున్న సినిమాలు వచ్చాయి. అందులో కన్నడనాట నుంచి చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద బ్లాస్టింగ్ కలెక్షన్స్ సాధించిన కాంతార యశ్, ప్రశాంత్ నీల్ మాస్, యాక్షన్ మూవీ ‘కేజీయఫ్2’ ఈరెండు సినిమాలు ఏకంగా 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి.