ఎస్ ఇది నూటికి నూరుశాతం నిజం.. బ్రో సినిమా విషయంలో పవన్‌ను త్రివిక్రమే నిండా నమ్మించి ముంచేశాడనే అందరూ అంటున్నారు. అందరూ అనడంవేరు.. పవన్ వీరాభిమానులు అనడం వేరు. త్రివిక్రమ్ మాంచి కమర్షియల్ టచ్ ఇచ్చాడు.. అయితే సినిమాలో మెయిన్ సోల్‌ను చంపేశారనే చెప్పాలి.
సినిమా చూస్తే మొత్తం చుట్టేసినట్టుగానే ఉంది. అసలు పవన్ లాంటి పెద్ద హీరో సినిమా అంటే ఇంత ఆషామాషీనా ? అన్నది త్రివిక్రమ్‌కే తెలియాలి.
అజ్ఞాతవాసి సినిమా టైంలోనే త్రివిక్రమ్ పవన్‌ను హీరోగా పెట్టుకుని ఆడుకోవడానికి సినిమా తీశాడన్న తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు బ్రో సినిమాను కూడా అంతే నిర్లక్ష్యంతో తీసినట్టుగా ఉంది. అసలు త్రివిక్రమ్ పవన్ క్రేజ్, ఫ్యానిజం, మార్కెట్ ఇవన్నీ ఆలోచించినట్టు లేడని పవన్ ఫ్యాన్సే అంటున్నారు. పవన్ దగ్గర చిటికెలు వేసి పని చేయించుకుని పవన్‌ను మాయలో పెట్టే త్రివిక్రమ్ చిటికెలు ఇప్పుడు మహేష్ విషయంలో ఎందుకు పని చేయడం లేదన్నది కూడా పెద్ద ప్రశ్నే.
అసలు గుంటూరు కారం కథ కోసం త్రివిక్రమ్ ఎన్నో కసరత్తులు, మార్పులు చేస్తున్నా మహేష్‌కు ఓ పట్టాన నచ్చడం లేదు. ఇక బ్రో మాటల్లో కూడా ఏ మాత్రం పదును లేదు. అసలు ఈ సినిమాకు ముందుగా బుర్రా సాయిమాధవ్‌ను తీసుకుని ఆయన్ను తప్పించేసి మరీ త్రివిక్రమ్ రాశాడు. సినిమా చూసిన పవన్ వీరాభిమానులు అసలు ఇవి త్రివిక్రమ్ రాసినట్టుగా లేవని.. ఎవరో అనుభవం లేని ఓ కుర్ర డైరెక్టర్ రాసినట్టుగా ఉన్నాయంటున్నారు.
ఇక స్క్రీన్ ప్లే కూడా చాలా వరస్ట్‌గా రాశాడు. హీరో మరణించినప్పుడు దేవుడి పాత్ర ఎంట్రీ అంటే ఎలా ఉండాలి… ఒళ్లు పులకరించిపోవాలి… రొమాలు నిక్కపొడుచుకోవాలి.. కానీ ఆ దేవుడి పాత్రకు లుంగీ కట్టి, బెల్ట్ పెట్టి ఓ మాస్ గెటప్ లో దేవుడిని చూపిస్తే ఫ్యాన్స్ ఈలలు వేస్తారేమో.. సామాన్య జనాలు అసహ్యించుకుంటారన్న విషయం త్రివిక్రమ్ లాంటి అపరమేథావికి తట్టకపోవడం విచిత్రం.
ఏదేమైనా త్రివిక్రమ్ తనకు రు. 15 కోట్లు వచ్చాయి.. ఇది తనకు, అటు పవన్‌కు కూడా భారీగా డబ్బు ముడితే అదే చాలనుకున్నారే తప్పా పవన్, తన రేంజ్ సినిమా తీయాలన్న భావన లేకుండా ముందుగానే ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. తమ ఇద్దరి కలయికలో సినిమా అంటే అది జీవితంలో ఓ మంచి సినిమాగా మిగిలిపోవాలన్న ఆలోచనతో అయితే ఏ మాత్రం తీయలేదు.