అగ్రదర్శకుడు బాలచందర్ అంటేనే ప్రయోగాలకు పెట్టింది పేరు. ఆయన ఏ సినిమా తీసినా.. ప్రయోగాలు ఉంటాయి. అది కూడా కుటుంబ నేపథ్యంలోనే ఉంటాయి. సగటు మధ్యతరగతి కుటుంబ కథలను దృష్టి లో పెట్టుకుని బాలచందర్ చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన తీసిన మరో చరిత్ర, గుప్పెడు మనసు, అంతులేని కథ.. ఇలాంటివి మధ్యతరగతి ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ పొందాయి
అయితే.. అంతులేని కథ సినిమాను తీయాలని అనుకున్నప్పుడు.. బాలచందర్ కొన్ని ఇబ్బందులు ఎదు ర్కొన్నారట. దీనికి కారణం.. ఈ సినిమాలో హీరోయిన్ లావణ్యంగా ఉండాలి. అదేసమయంలో పొగరుతోనూ.. ఆలోచనాపరురాలైన వ్యక్తిత్వంతోనూ ఉండాలి. ఇక, బాధ్యతాయుతమైన నడవడికతోనూ ఉండాలి. మరి ఇన్ని లక్షణాలున్న హీరోయిన్ ఎక్కడ దొరుకుతుంది? అనేది బాలచందర్ సమస్య. ఇలా వెతికిన ఆయనకు రజనీకాంత్ సూచన ప్రకారం జయప్రదను తీసుకున్నారు.
అయితే.. ఇదే సినిమాలో రజనీ కూడా నటించారు. అయితే.. ఈయన హీరో కాదు. సగటు మధ్యతరగతి కుటుంబంలో పెద్ద. పైగా ఎలాంటి బాధ్యత , బరువు లేకుండా.. విచ్చలవిడిగా తిరిగే తాగుబోతు. ఈ పాత్రలో రజనీ నటన అద్భుతం. అవార్డులు కూడా అందుకున్నారు. కానీ.. ఇదే సినిమాలో రజనీకి చెల్లెలిగా.. కుటుంబ బాధ్యతను మోసే వ్యక్తిగా జయప్రద నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మధ్యతరగతి నుంచి మంచి ఆదరణ కూడా పొందింది.
అయితే.. ఈ సినిమా తర్వాత జయప్రద ఆరు మాసాలు ఖాళీగా ఉండిపోయిందట. ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదట. దీనికికారణం.. అంత గంభీరమైన పాత్రలో జయప్రదను చూసిన ప్రేక్షకులు.. మళ్లీ డ్యాన్స్‌లు, పాటల్లో జయప్రదను రిసీవ్ చేసుకుంటారో లేదో అనే సందేహంతోనే ఆమెను దూరం పెట్టారని టాక్. తర్వాత.. చాన్నాళ్లకు కానీ.. దాసరి ఆమెకు ఛాన్స్ ఇవ్వలేక పోయారట. ఈ విషయం అనేక సందర్భాల్లో జయప్రద చెప్పుకొన్నారు.