Moviesశ్రీలీల బ్రతుకు కూడా ఆ హీరోయిన్ లాగే..వేణు స్వామీ సంచలన కామెంట్స్...

శ్రీలీల బ్రతుకు కూడా ఆ హీరోయిన్ లాగే..వేణు స్వామీ సంచలన కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ యంగ్ బ్యూటీ శ్రీ లీల హవా ఎలా కొనసాగుతుందో మనకు బాగా తెలిసిన విషయమే. స్టార్ హీరో అయినా సరే సీనియర్ హీరో అయినా సరే యంగ్ హీరో దగ్గర నుంచి కూడా అందరు ఆ బ్యూటీ ని ఇండస్ట్రీలో సినిమాలో పెట్టుకోవడానికి చూస్తున్నారు . ఈ క్రమంలోనే శ్రీలీల చేతిలో ఏకంగా 12 సినిమాలు వచ్చి చేరాయి . అయితే శ్రీ లీల ఎంత బిజీగా ఉన్నా.. తన వద్దకు వచ్చిన డైరెక్టర్స్ కి నో కాదు అని చెప్పి బాధ పెట్టడం లేదట .

ఎలాగోలా అడ్జస్ట్ చేసి కాల్ షీట్స్ ఆ డైరెక్టర్ ని సంతృప్తి పరిచే పంపిస్తుందట . ఈ క్రమంలోనే యంగ్ బ్యూటీ శ్రీలీలపై ఆస్ట్రలజర్ వేణు స్వామి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఈ మధ్యకాలంలో వేణు స్వామి ఎలా ఉన్నది ఉన్నట్లు ..ఎలా జరిగేది జరగబోయేటట్లు చెబుతున్నాడో మనకు తెలిసిందే . ఈ క్రమంలోనే శ్రీలీల జాతకం గురించి ఆయన మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు .

ఆయన మాట్లాడుతూ..” శ్రీలీలది మీనరాశి.. కాబట్టి ఆమెకు మరికొన్ని రోజుల్లోనే రాజయోగం పడుతుంది. ఏ పని చేసిన ఆమెకి ఆదాయం డబల్ గా కలిసొస్తుంది . అంతేకాదు శ్రీలీల జాతకం 2028 వరకు ఇలాగే కొనసాగుతూ వస్తుంది. అందర్నీ తొక్కేసి నెంబర్ వన్ హీరోయిన్ గా మారిపోతుంది . సమంత , పూజ హెగ్డే , రష్మిక , నయనతార.. వాళ్ళ కన్నా కూడా శ్రీలీల టాప్ పొజిషన్లో ఉంటుంది ” అంటూ చెప్పుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news