సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ఊహించిన కాంబోలో సెట్ అవుతూ ఉంటాయి . అసలు ఫ్యాన్స్ అలాంటి కాంబో వస్తుందా..? అని ఊహించుకోవడానికి అసలు అంతు చిక్కని కాంబోలు సైతం కొందరు డైరెక్టర్లు సెట్ చేసి పెడుతూ ఉంటారు . అలాంటి లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు ఫ్యామిలీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇప్పటివరకు ఈయన తెరకెక్కించిన సినిమాలు చూస్తే ఈయన సినిమాలు చేసిన పద్ధతులను గమనిస్తే ఆ విషయం మనకు ఇట్టే అర్థమవుతుంది . ఫిదా సినిమాలో ఆరడుగుల ఉన్న వరుణ్ తేజ్ కు పొట్టిగా ఉన్న సాయి పల్లవిని మ్యాచ్ చేసి హిట్ కొట్టాడు .
ఈయన కాంబోలు ఎంత విచిత్రంగా ఉంటాయో దీనిని బట్టే తెలిసిపోతుంది. అయితే మరోసారి అలాంటి ఓ క్రేజీ కాంబోని సెట్ చేయడానికి చూస్తున్నాడు శేఖర్ కమ్ముల .ఇప్పటికే శేఖర్ కమ్ముల ధనుష్ తో సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది . ఈ సినిమాను సునీల్ – పుష్కూర్ రామ్మోహన్ నిర్మించబోతున్నారు . త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ సినిమాలో ధనుష్‌కు జంటగా రష్మిక మందన్నాను హీరోయిన్గా చూస్ చేసుకున్నారట .
ఇప్పటికే సంప్రదింపులు జరుపగా ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తుంది . దీంతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా పేరు సంపాదించుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రష్మిక మందన నటించబోతున్నారు . ఈ క్రమంలోనే ఈ సినిమాలో హోమ్లీ రొమాన్స్ కూడా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ధనుష్ కొంతకాలం క్రితమే తన భార్య ఐశ్వర్య దగ్గర నుంచి విడాకులు తీసుకున్నారు . ఇలా విడాకులు తీసుకున్న హీరో తో రొమాన్స్ చేయడం ఏంటి అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . దీని వల్ల కోలీవుడ్‌లో అమ్ముడుకున్న పరువు కూడా పోయే పరిస్థితి వస్తుందని ..ధనుష్ కి కోలీవుడ్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఐశ్వర్య కి అంతే ఉందని.. ధనుష్‌తో లిమిట్స్ లేకపోతే మీ కెరియర్ కొలాప్స్ అవుతుందని హెచ్చరిస్తున్నారు..!!