సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్. సినిమాలకు నాంది పలికిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించారు. అప్పటివరకు సింగల్ హీరోలే వరుసగా హిట్ కొడుతున్న సినిమాలు వచ్చిన ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలు కలిసి కూడా హిట్ కొట్టగలరని ప్రూవ్ చేసింది ఈ సినిమానే. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ విజయాన్ని అందుకుంది .
ఈ సినిమాలో హీరోయిన్లుగా అంజలి – సమంత నటించారు. చిన్నోడా..పెద్దోడా అంటూ మహేష్ బాబు – వెంకటేష్ పాత్రను బాగా డిజైన్ చేశాడు శ్రీకాంత్. కాగ మహేష్ బాబు పాత్ర కోసం ఈ సినిమాలో మొదటగా అనుకున్న హీరో పవన్ కళ్యాణ్ అంటూ తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కి మొదట ఈ కథను చెప్పారట మేకర్స్. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాను అత్తారింటికి దారేది మూవీలో బిజీగా ఉన్నాను డేట్స్ ఖాళీగా లేవు అంటూ రిజెక్ట్ చేసారట. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసింది హీరోగా వెంకటేష్ నటిస్తున్నారు అని అప్పట్లో ప్రచారం జరిగింది .
పవన్ కళ్యాణ్ వెంకటేష్ లు చూడటానికి ఒకేలా ఉంటారు. ఒకే టైపు గా ఉన్న హీరోస్ ని పెట్టి సినిమా తీయాలంటే చాలా కష్టం . అది కూడా తన లుక్స్ ఉన్న హీరోని తనకు అన్నగా చూపించే ప్రయత్నం చేస్తే సినిమా ఖచ్చితంగా దెబ్బ పడిపోతుంది . అయితే ఇవన్నీ చెప్తే మేకర్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అని బలవంతంగా సినిమాకి ఎలా అయినా ఒప్పిస్తారేమోనని పవన్ కళ్యాణ్ డేట్స్ ఖాళీ లేవు అంటూ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేసారట . ఆ తర్వాత ఈ పాత్ర కోసం మహేశ్ ని చూస్ చేసుకున్నారు. తన కెరీర్ లో ఓ మంచి పాత్రను పోషించారు . ఇప్పటికీ ఈ సినిమాలో మహేష్ బాబు రోల్ చాలామంది లేడీస్ లైక్ చేస్తూ ఉంటారు..!!