Newsపెళ్ళి కాకుండానే బ్రేకప్ చెప్పుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరో-హీరోయిన్.. అంత ఫిక్స్...

పెళ్ళి కాకుండానే బ్రేకప్ చెప్పుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరో-హీరోయిన్.. అంత ఫిక్స్ అయ్యాక ఈ షాక్ ఏంటి సార్..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా బ్రేకప్ చెప్పేసుకుంటున్నరు జంటలు. ఓ సినిమా చేసే టైంలో హీరో హీరోయిన్ ప్రేమలో పడటం.. కొన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా బాగా తిరిగి ఎంజాయ్ చేయడం. ఆ తర్వాత వన్ ఫైన్ డే మేము పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పడం.. కొన్నాళ్ళకి విడాకులు తీసుకొని ఎవరిదారి వారిది అన్నట్లు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసేయడం ..ఈ తంతు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది . కేవలం స్టార్ సెలబ్రిటీసే కాదు .. బుల్లితెరపై ఉండే యాక్టర్స్ కూడా ఇలాగే చేస్తున్నారు .

అయితే రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ జంట పెళ్లి వరకు వెళ్లకుండానే విడిపోతుంది అన్న ప్రచారం రూపొందుకుంది. ఆ జంట మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అడవి శేషు.. ఒకప్పుడు హీరోయిన్గా నటించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసిన చేస్తున్న అక్కినేని మేనకోడలు సుప్రియ యార్లగడ్డ . ఎస్ గత కొంతకాలంగా వీళ్ళమధ్య ప్రేమాయణం నడుస్తుందని త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని .. గతంలో ఓసారి క్రిస్మస్ పార్టీ సెలబ్రేషన్స్ లో ఈ జంట పక్కపక్కనే ఉన్న పిక్స్ వైరల్ అయాయి.

ఆ తర్వాత ఈవెంట్లో ఇద్దరు ఒకే కారులో నుంచి దిగడం మీడియా కంట కనపడింది . అప్పటినుంచి వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళ పెళ్లికి అక్కినేని ఫ్యామిలీ ఒప్పుకోలేదట . ఈ క్రమంలోనే సుప్రియ యార్లగడ్డ అడవి శేషుని దూరం పెడుతుంది అన్న వార్త వైరల్ గా మారింది. అంతేకాదు వీళ్ళిద్దరు బ్రేకప్ కూడా చెప్పేసుకున్నారు అన్న కామెంట్లు కూడా వినపడుతున్నాయి. దీంతో అంతా ఫిక్స్ అయిపోయి.. రేపో మాపో పెళ్లి అనగా ఈ షాక్ ఏంటి సార్..? అంటూ అడవి శేష్ పై కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. చూడాలి మరి దీనిపై అడవి శేషు ఏ విధంగా స్పందిస్తాడో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news