మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న సావిత్రి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే . ఈ జనరేషన్ వాళ్ళకి సావిత్రి అంటే పెద్దగా తెలియదు. కానీ ఒకప్పటి జనరేషన్ వాళ్ళకి సావిత్రి అంటే సినిమా ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేసిన హీరోయిన్గా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికి మన ఇంట్లో ఉన్న అమ్మమ్మలు తాతలు మహానటి సావిత్రి గారి సినిమాలను టీవీలో వస్తే కన్నురెప్ప ఆర్పకుండా చూసే వారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాలో మహానటి సావిత్రికి సంబంధించిన పలు ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ విషయాలు ట్రెండ్ అవుతున్నాయి.
కాగా సావిత్రి తన కెరీర్లు ఎంతో మంది హీరోలతో నటించింది . ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది . బడా బడా స్టార్ హీరోలు కూడా ఆమె కాల్ షీట్స్ కోసం వెయిట్ చేసే అంత పాపులారిటీ దక్కించుకునింది మహానటి సావిత్రి . ఇదే టైంలో చాలామంది కూడా ఆమెను ప్రేమించారు. ఆమెతో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఆలోచించారు . కానీ ఆ అవకాశం ఎవరికీ ఇవ్వలేదు సావిత్రి . అయితే గతంలో సావిత్రి స్క్రీన్ షేర్ చేసుకున్న ఓ హీరోతో ప్రేమాయణం నడిపింది అన్న వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.
ఆయన మరెవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు. ఏ ఎన్ ఆర్ – సావిత్రిల కాంబో తెరపై ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు వీళ్ల మధ్య ప్రేమ ఉందని పుకార్లు పుట్టించేసారు. కానీ అది కేవలం ఫ్రెండ్షిప్ అని అది చూసేవాళ్ళకు మాత్రం మరేదోలా అనిపించిందని ..ఈ టైం లోనే సావిత్రి ఏఎన్నార్లు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగిందట. అయితే అదంతా ఫేక్ – ఏఎన్ఆర్ నా ఫ్రెండ్ అంటూ సావిత్రి ఎన్నిసార్లు చెప్పినా ఎవరు వినలేదు. దీంతో నమ్మనోళ్ల గురించి నేను ఎందుకు బాధపడాలి అంటూ సావిత్రి ఆ విషయాన్ని లైట్ గా తీసుకున్నారట. అయితే ఇవే మాటలు విని ఏఎన్ఆర్ సైతం నవ్వుకున్నారు అట. ఏం సావిత్రి నేను అందగాడిని కానా..? నాను ఎందుకు పెళ్ళి చేసుకోవు అంటూ సరదాగా ఆటపట్టించేవాడట..!!