మన టైం బాగోలేకపోతే మనకు ఇష్టం లేనట్టు కూడా చేయాల్సి వస్తుంది.. మనం నో కాదు వద్దు కూడదు అనుకున్న వ్యక్తులతోనే మనం ఉండాల్సి వస్తుంది. అది సాధారణంగా కొందరు జీవితాల్లో జరిగే విషయమే . అయితే ప్రెసెంట్ స్టార్ సెలబ్రెటీ అయిన పూజ హెగ్డే సైతం అలాంటి టఫ్ సిచువేషన్ ని ఫేస్ చేస్తుంది అన్న కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే ప్రెసెంట్ పూజ హెగ్డే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో . రెమ్యూనరేషన్ లేకుండా చేస్తాం రా బాబు అన్న అవకాశాలు ఇవ్వడం లేదు.
అలాంటి హీరోయిన్ కి ఓ తెలుగు హీరో పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. దీంతో ఎగిరి గంతేసిన ఈ బ్యూటీ ఇష్టం లేకపోయినా సరే ఆ హీరో సినిమాలో నటించాల్సి వస్తుంది. ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్న రవితేజ. ఎస్ రవితేజ నెక్స్ట్ చేయబోయే సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా పెట్టుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.
అంతేకాదు పూజా హెగ్డే ఈ సినిమా కోసం దాదాపు రెండు కోట్లు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది . అసలు ఏ డైరెక్టర్ ఏ హీరో చూడని ఈ బ్యూటీపై రవితేజ మనసు పడడానికి కారణం గతంలో ఆమెపై ఉన్న మంచి ఒపినియన్ అని అంటూ తెలుస్తుంది . మొత్తానికి ఈ అవకాశం ఏ విధంగా మార్చుకుంటుందో పూజా హెగ్డే చూడాలి..!!