Moviesనమ్రత ముంబై తెలివితేటలకు మహేశ్ కూడా షాక్ .. ఒక్క దెబ్బతో...

నమ్రత ముంబై తెలివితేటలకు మహేశ్ కూడా షాక్ .. ఒక్క దెబ్బతో ఘట్టమనేని ఫ్యామిలీ పేరు మారుమ్రోగిపోయేల చేసేసిందిగా..!!

ఎస్ ..అవునండి ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ఘట్టమనేని ఫ్యామిలీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ .. ఆ తర్వాత గుర్తొచ్చేది మహేష్ బాబు. ఇప్పటివరకు ఘట్టమనేని ఫ్యామిలీ అంటే వీళ్లిద్దరే గుర్తోచ్చే వాళ్ళు. అయితే ఇప్పుడు ఘట్టమనేని అనగానే అందరికీ ముందును గుర్తొస్తుంది సితార పాప. రీసెంట్గా ఆమె నటించిన పిఎంజె జువెలరీ యాడ్ రిలీజ్ అయింది . ఈ క్రమంలోనే గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో సితార పాప పేరు మారు మ్రోగిపోతుంది.

మరీ ముఖ్యంగా మహేష్ కి మించిన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది అంటూ ఈ యాడ్ ని తెగ ట్రెండ్ చూస్తున్నారు అభిమానులు . ఏ మాటక ఆ మాట సితార పాప ఈ చిన్న వయసుకే ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయి . దినంతటికీ కారణం మహేష్ బాబు భార్య నమ్రత అంటూ ప్రచారం జరుగుతుంది . అసలు ఓ స్టార్ హీరో కూతుర్ని ఇండస్ట్రీలో హీరోయిన్ గా లేదా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేయకుండా ఇలా జ్యువలరీ యాడ్ తో లాంఛ్ చేయడం అభిమానులకి షాకింగ్ గా అనిపించింది .

సితార క్రేజ్ కి రేంజ్ కి లెవెల్ కి ఏ పాన్ ఇండియా ఫిలిమ్ తో లాంచ్ అవాలి. అయితే నమ్రత మాత్రం చాలా తెలివితేటలతో ముందుగా జ్యూవెలరి బ్రాండ్ అంబాసిడర్ గా రంగంలోకి దింపింది .ఎవరికైనా సరే ముందు తమ స్టామినా ఏంటో తెలియాలి ..ఆ తర్వాతే ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి ..పెట్టడం పెట్టడమే బిగ్ సినిమాలో అడుగుపెట్టి ఫ్లాప్ కొడితే సితార కెరియర్ కి మైనస్ గా మారిపోతుంది . అందుకే సితారను ఓ బ్రాండ్ అంబాసిడర్ గా రంగంలోకి దించి ముంబై తెలివితేటలను గుర్తు చేసింది నమ్రత. ఈ క్రమంలోనే ముంబై తెలివితేటలు అంటూ నమ్రతను ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు అభిమానులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news