సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు రావడానికి తెగ ట్రై చేస్తూ ఉంటారు స్టార్ డైరెక్టర్ లు. అయితే ఎన్నిసార్లు సరే ప్రయత్నించినా అలాంటి కొన్ని క్రేజీ కాంబోలో సెట్ అవుతూ ఉండవు కానీ కొన్ని కొన్ని సార్లు సెట్ అవుతుంది . లాస్ట్ మూమెంట్లో క్యాన్సల్ అవుతూ ఉంటాయి . అలాంటి ఓ క్రేజీ కాంబో నే టాలీవుడ్ నటసిం హం గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ లోకనాయకుడు కమలహాసన్ కాంబో . మనకు తెలిసిందే వీళ్ళిద్దరూ చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్.
ఒకరి సినిమాలకి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలు. ఇద్దరు టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇద్దరు హీరోలకి సపరేట్ సపరేట్ స్టైల్ కూడా ఉంది . అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది . అయితే ఇద్దరు హీరోలు కలిసి ఓ సినిమాలో నటించాల్సి ఉండింది. సినిమా అగ్రిమెంట్ పేపర్లపై కూడా సైన్ చేశారు . కానీ లాస్ట్ మూమెంట్లో కొన్ని కారణాల చేత ఆ సినిమా ఆగిపోయింది . ఆ సినిమా మరేదో కాదు బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆదిత్య 369 . ఎస్ మీరు విన్నది నిజమే.. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య హీరోగా నటించగా.. మోహిని హీరోయిన్గా నటించారు.
అమ్రిష్ పూరి -ఆనంద్ గొల్లపూడి – మారుతీరావు – సిల్క్ స్మిత తదితరులు కీలకపాత్రలో పోషించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా అప్పట్లో బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ రికార్డులను సాధించిన మూవీ గారికార్డు నెలకొల్పింది . కాగ పూర్తిగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఫస్ట్ సినిమా ఇదే కావడం అప్పట్లో సంచలనంగా మారింది . అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటించాల్సి ఉందట . ఈ సినిమాలో హీరో హీరోయిన్ లు..శ్రీకృష్ణదేవరాయుల కాలానికి వెళ్తారు. అయితే శ్రీకృష్ణదేవరాయల పాత్ర కోసం మొదటిగా మేకర్స్ కమల్ హాసన్ ని అనుకున్నారట .
కథ విన్న ఆయన కూడా ఓకే చేశారట . కానీ లాస్ట్ మూమెంట్లో ఈ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నారట కమలహాసన్ . వేరే సినిమా కాల్ షీట్స్ సడన్గా అడ్జస్ట్ చేయాల్సి వచ్చిన కారణంగా ఈ సినిమా టీంకు సారీ చెబుతూ కమల్ హాసన్ ఆదిత్య 369 సినిమా నుంచి తప్పుకున్నాడు అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది . అప్పుడు మిస్ అయిన ఈ కాంబో ఇప్పటివరకు సెట్ అయిందే లేదు . చూడాలి మరి వీళ్ళ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో..?