ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బుల్లితెర రాములమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . దీనికి సంబంధించిన కొన్ని క్లిప్స్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే ప్రజెంట్ ఉండే యాంకర్స్ లో సుమ నెంబర్ వన్ గా ఉంటే నెంబర్ 2 పొజిషన్లో ఉంది యాంకర్ శ్రీముఖి . ఆల్మోస్ట్ అన్ని స్టార్ చానల్స్ తో డీల్ మాట్లాడుకుని .. ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాం చేస్తూ మరోవైపు యూట్యూబ్ ని కూడా షేక్ చేస్తుంది .
కాగ యాంకర్ శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది. దానికి కారణం లేకపోనూ లేదు రీసెంట్ గానే శ్రీముఖి మంత్రి రోజాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది . అంతేకాదు ఇలా ఎప్పుడైనా సరే శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే వెంటనే ఒక గుడ్ న్యూస్ చెప్తూ వచ్చేది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీముఖి ..”తాను ఏదైనా గుడ్ పనిచేసే ముందు గుడ్ న్యూస్ చెప్పే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని “చెప్పుకొచ్చిందట.
ఈ క్రమంలోనే శ్రీముఖి సడన్గా ఇలా తిరుములలో ప్రత్యక్షమవడంతో అభిమానుల త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతుందని ఆ గుడ్ న్యూస్ చెప్పడానికి ఇలా స్వామివారిని దర్శించుకుందని చెప్పుకొస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం మరో రెండు నెలల్లో శ్రీముఖి పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. అయితే శ్రీముఖి తన జాన్ జిగిడి ఫ్రెండ్ నే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది..!!