Moviesమహేష్‌ కూతురా మజాకా.. చిన్న ఏజ్ లోనే సితార ఏం చేసిందో...

మహేష్‌ కూతురా మజాకా.. చిన్న ఏజ్ లోనే సితార ఏం చేసిందో తెలిస్తే శభాష్‌ అనాల్సిందే..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు .. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ స్థానంలో ఉన్నారో మనకు తెలిసిందే. ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకమైన సినిమాలో నటించబోతున్నాడు . ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయబోతున్నాడు మహేష్ బాబు అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే ఒక సినిమా చేయకుండానే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న మహేష్ బాబు ను చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతుంటే .. ఇప్పుడు ఆయన కూతురు ఒక సినిమా చేయకుండానే పాన్ వరల్డ్స్దాయి క్రేజ్ దక్కించుకోవడం అభిమానులకి ఆనందంగా ఉంది . మనకు తెలిసిందే మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది . ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడానికి సిద్ధమవుతుంది. ఇలాంటి క్రమంలోనే ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది సితార ఘట్టమనేని .

పీఎంజే జ్యువలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది . దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ నెట్టింత ట్రెండింగ్ గా మారాయి . ఈ యాడ్ లో ఆభరణాలు ధరించి కెమెరాకి ఫోజులు ఇచ్చింది సితార . చూడడానికి చాలా క్యూట్గా ప్రిన్సెస్ లా ఉన్న సితార ఫొటోస్ ఏకంగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై కూడా ప్రదర్శించారు . ఈ ఘనత సాధించిన తొలి స్టార్ కిడ్ గా సితార రికార్డులు క్రియేట్ చేసింది . కాగా ఇప్పుడు ఆ జ్యూవెలరీ బ్రాండ్ కోసం వచ్చిన డబ్బులను మొత్తం ఓ చారిటబుల్ ట్రస్ట్ కి ఇచ్చి షాకింగ్ కి గురిచేసింది సితార. జనరల్ గా ఎవరైనా సరే అంత డబ్బులు వస్తే ఏదైనా కొనుక్కుంటారు . వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు అయితే సితార ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం చారిటబుల్ ట్రస్ట్ కి డొనేట్ చేసిందట . దీంతో ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు మహేష్ అభిమానులు. ఇంత చిన్న ఏజ్ లోనే ఇంత పెద్ద మనసు గొప్ప మనసు చాటుకున్న సితారకు హ్యాట్సాఫ్ చెప్పుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news