బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ జాన్వికపూర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలో నటించింది . క్రేజీ హిట్ పడకపోయినా సరే స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న జాన్వికపూర్.. ప్రసెంట్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న దేవర సినిమాలో నటిస్తుంది .ఈ సినిమా కోసం జాన్వి కపూర్ చాలా చాలా కష్టపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే జాన్వికపూర్ మరో రెండు తెలుగులో బడా సినిమాలకు సైన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. రాంచరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్గా జాన్వి సెలెక్ట్ అయినట్లు సినీ వర్గాలలో వైరల్ గా మారింది . అంతేకాదు అఖిల్ నటించబోయే సినిమాలో కూడా హీరోయిన్ గా జాన్వీ సెలక్ట్ అయిన్నట్లు తెలుస్తుంది . కాగా ఇలా బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలో నటిస్తూ.. ఫుల్ క్రేజ్ లో దూసుకుపోతున్న జాన్వికపూర్ .. తెలుగు హీరోతో పీక లోతుల్లో ప్రేమలో మునిగి తేలిపోయింది అనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .
గత కొన్ని రోజులుగా తెలుగు హీరోని పదేపదే కలుస్తూ వస్తుందట ఈ జాన్వి కపూర్ . అంతేకాదు జాన్వి కపూర్ కోసం ఈ తెలుగు హీరో ముంబైకి కూడా వెళ్తున్నాడట . అంతేనా రీసెంట్ గానే జాన్వి కపూర్ ఈ తెలుగు హీరోని బోని కపూర్ కి సైతం పరిచయం చేసిందట . దీంతో బాలీవుడ్ టౌన్ లో ఈ న్యూస్ వైరల్ గా మారింది . బోనీకపూర్ ఇంటికి తెలుగు హీరో అల్లుడుగా వెళ్ళబోతున్నాడు అంటూ ప్రచారం చేస్తుంది బాలీవుడ్. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ స్టార్ హీరోని ఓ రేంజ్ లో పొగిడేసింది. ఇండస్ట్రీకి ఇలాంటి హీరోనే కావాలి అంటూ ఆకాశానికి ఎత్తేసింది .త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలేకపోతున్నారని ప్రచారం జరుగుతుంది . చూడాలి మరి ఏం జరుగుతుంది..?