సినిమా ఇండస్ట్రీలో సింగర్ చిన్మయికి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎంత చక్కగా పాటలు పాడుతుందో ఎంత అందంగా ఉంటుందో ఎంత అందంగా డబ్బింగ్ చెప్తుందో అంతకంటే డబల్ నిజాయితీగా ఉన్న విషయాన్ని అడిగి కడిగి పారేస్తుంది . ఇప్పటికే ఎన్నో విషయాల్లో చిన్మయి ఆడవాళ్ళ పక్కనే నిల్చుని మాట్లాడి సపోర్ట్ చేస్తూ .. వాళ్లకి ధైర్యం ఇచ్చిన సంగతి తెలిసిందే . అసలు ఇండస్ట్రీలో మీటూ ఉద్యమాన్ని లేపింది చిన్మయి అన్న సంగతి చాలా మందికి తెలుసు. కాంట్ర వర్షియల్ కామెంట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన చిన్మయి రీసెంట్గా తమిళనాడు సీఎంనే టార్గెట్ చేసి చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
మీటూ ఉద్యమంలో భాగంగా తమిళ పాటలు రచయిత వైరముత్తు మీద ఆమె ఎన్నో ఆరోపణలు చేసింది . ఎన్నో సోషల్ మీడియాలో పోస్ట్లు చేసి అతగాడి గుట్టు రట్టు చేసింది . అయినా సరే ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. సామాన్య జనాలు పట్టించుకోకపోయినా పర్లేదు ఏకంగా ప్రజల బాగోగులు చూసుకొని గవర్నమెంట్ ని రన్ చేసే సీఎం సైతం అతగాడికి ప్రిఫరెన్స్ ఇస్తూ నెత్తిన పెట్టుకోవడంపై సింగర్ చిన్మయి మండిపడింది. రీసెంట్గా వైర ముత్తు తన పుట్టినరోజు జరుపుకున్నాడు . ఈ క్రమంలోని తమిళనాడు సీఎం స్టాలిన్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు . అయితే ఇదే ఫోటోని షేర్ చేస్తే సింగర్ చిన్మయి అడిగి కడిగి పారేసింది .
సీఎం స్టాలిన్ పై మండిపడింది . “లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటికి వెళ్లి మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా చెప్తారు ..అటువంటి వారితో అసలు కలిసి ఎలా మీరు అడుగులు వేస్తారు..? మీపై కూడా నమ్మకం కోల్పోతుంది అంటూ ఫైర్ అయింది. ఈ క్రమంలోని సుదీర్ఘంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకు వచ్చింది . నా తప్పు లేకపోయినా నన్ను బ్యాన్ చేశారు . ఐదేళ్లుగా నరకం చూస్తున్నాను. న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరిగితే ఎవరూ పట్టించుకోవడం లేదు . న్యాయం కోసం పోరాడితే నాపై కక్ష సాధిస్తారా..? అంటూ మండిపడింది . అంతేకాదు చాలామంది ఈ వివాదంలో సింగర్ చిన్మయికి సపోర్ట్ చేస్తూ ఉండడం.. దీంతో తమిళనాడు ప్రభుత్వం పరువు తీసేసింది సింగర్ చిన్మయి అంటూ జనాలు చెప్పుకుంటున్నారు . మొత్తానికి సింగర్ చిన్మయి పెట్టిన పోస్ట్ ఇప్పుడు ప్రభుత్వాల మధ్య పెద్ద చిచ్చే పెట్టినట్లయ్యింది..!!