టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు హీరో ఆనంద్ దేవరకొండ ఎంతో ఇష్టంగా ..ప్రతిష్టాత్మకంగా తీసుకున్నచేసిన సినిమా బేబీ . ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసిన పెద్దగా క్లిక్ అవ్వని ఆనంద్ దేవరకొండ తన ఖాతాల దొరసాని – మిడిల్ క్లాస్ మెలోడీస్- పుష్పక విమానం వంటి చిత్రాలతో మన ముందుకు వచ్చారు . అయితే ఏ సినిమా కూడా పెద్దగా ఆయన కెరియర్ని ముందుకు తీసుకెళ్లలేకపోయింది . దీంతో కమర్షియల్ హిట్ కోసం ఎంతో ట్రై చేస్తున్న ఆనంద్ దేవరకొండ బేబీ అనే సినిమా ద్వారా నేడు మన ముందుకు వచ్చాడు . ట్రయాంగిల్ లవ్ స్టోరీ తరహాలో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించక ..వీరాజ్ అశ్విన్ మరో హీరోగా నటించారు .
మాస్ మూవీ మేకర్స్ పతాకం పై ఎస్ కే ఎన్ నిర్మించిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది . అయితే ఫస్ట్ షో తోనే బొమ్మ బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ లు ఎన్ని వచ్చినా ఈ సినిమాలో మాత్రం నేటి జనరేషన్ అమ్మాయిలు- అబ్బాయిలు ఎలా ఆలోచిస్తున్నారు ..ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు క్లియర్గా చూపించాడు డైరెక్టర్ సాయి రాజేష్.
సినిమా స్టోరీ విషయానికి వస్తే ఆనంద్ వైష్ణవి స్కూల్ డేస్ నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు ..అయితే ఆనంద్ దేవరకొండ ఫైనాన్షియల్ ఇబ్బంది కారణంగా చదువును టెన్త్ క్లాసులోనే ఆపేస్తాడు . తండ్రి ఉండడు అమ్మ మూగది . ఈ క్రమంలోని పరిస్థితిని తన భుజాలపై వేసుకొని కుటుంబాన్ని నడపడానికి ఆటో నడుపుతూ ఉంటాడు . అయితే వైష్ణవి చైతన్య ఇంటర్ పూర్తిచేసి బీటెక్ జాయిన్ అవుతుంది . అయితే కాలేజ్ దూరం కావడంతో వీరిద్దరి మధ్య ఎక్కడ దూరం పెరుగుతుందో అన్న కారణంగా ఆటో అమ్మేసి మరి రెండు స్మార్ట్ ఫోన్లు కొంటాడు .వైష్ణవి చైతన్య కాలేజీలోకి వెళ్ళాక ఆమె తన రూపురేఖలు స్టైల్ మొత్తం మార్చేస్తుంది. ఈ క్రమంలోనే వీరాజ్ కి దగ్గరవుతూ.. ఆనంద్ ను దూరం పెడుతుంది.
అయితే ఓవైపు ఆనంద్ దేవరకొండ చూపించిన రియల్ ప్రేమను వైష్ణవి మర్చిపోలేదు.. మరోపక్క వీరాజ్ చూపించే నేటి జనరేషన్ సర్ప్రైజింగ్ ప్రేమను వదులుకోలేదు .వీరిద్దరి మధ్య వైష్ణవి చైతన్య నడిపిన ప్రేమాయణం మాత్రం సినిమాకే హైలెట్గా నిలిచింది . అంతేకాదు అసలు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో తప్పు ఎవరిది ..? ఫైనల్లి ఎవరు విన్ అయ్యారు..? వైష్ణవి ఎవరిని పెళ్లి చేసుకుంది ..? అన్నది అసలు సస్పెన్స్ . అయితే క్లైమాక్స్ పెద్దగా జనాలని మెప్పించలేకపోయింది. అంతే కాదు కధ పరంగా కూడా స్లోగా వెళుతూ ఉండడంతో జనాలకు తలనొప్పి వచ్చింది .కధ కంటెంట్ బాగున్న ఆ కథను ముందుకు తీసుకెళ్ల విషయంలో డైరెక్టర్ ఫ్లాప్ అని చెప్పాలి . అయితే సినిమాను తన భుజాలపై వేసుకుని నడిపించింది వైష్ణవి చైతన్య . ఓవైపు ఆనంద్తో ప్రేమ ..మరోవైపు వీరాజ్ తో సర్ప్రైజ్లు రెండిటిని బాగా మేనేజ్ చేసింది .
ఆనంద్ దేవరకొండ సైతం నటనపరంగా టు గుడ్ అనిపించుకున్నాడు. మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది . ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా విజయ్ మనసుకు హత్తుకునేలా సంగీతం అందించాడు . మొత్తానికి సినిమా నేటి కాలం జనరేషన్ కి బాగా నచ్చేస్తుంది నే. టి కాలం జనరేషన్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు? అబ్బాయిలు దానివల్ల ఎలాంటి ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు ..అనేది క్లియర్ గా చూడొచ్చు. టోటల్గా క్లీన్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది . చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏవిధంగా సాధిస్తుందో..?