ఒక్క ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది అంటుంటారు మన ఇంట్లోని పెద్దవాళ్లు . అయితే ఈ అమ్మడు విషయంలో అచ్చం అలాగే జరిగింది . కాశ్మీరా షా.. బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ హిందీ తో పాటు తమిళ్ – తెలుగు- భోజపురి – మరాఠి సినిమాలలో నటించిన ఈ బ్యూటీ గురించి ఎప్పటికప్పుడు వార్తలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి .
బిగ్ బాస్ 1 – నాచుబలి 3- ఫియర్ ఫ్యాక్టర్- కత్రోని కేక్ లాడి 4 షోస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ బ్యూటీ ఎంత హంగామా సృష్టించిందో పాపులారిటీ దక్కించుకుందో అందరికీ బాగా తెలిసిన విషయమే. కాగా 2003లో బ్రాడ్ లిట్టర్ మాన్ ను పెళ్ళి చేసుకున్న ఈమె పెళ్లి అయిన నాలుగేళ్ళకే ఆయనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడిపోయింది. ఆ తర్వాత పదేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. 2013లో ప్రముఖ నటుడు టీవీ హోస్ట్ కృష్ణ అభిషేక్ ని పెళ్లి చేసుకుంది . అప్పటినుంచి వీళ్ళ జీవితం హ్యాపీగా ముందుకెళుతూ ఉంది. అయితే ఎన్నోసార్లు ట్రై చేసిన మాత్రం వీళ్లకు ప్రెగ్నెన్సీ రానే రాలేదట .
మొత్తంగా 14 సార్లు ట్రీట్మెంట్ తీసుకొని మరి ట్రై చేశారట . అయినా కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదట . ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు చాలా చాలా ట్రై చేసిందట .కానీ అది కూడా సక్సెస్ కాలేదట . ఫైనల్లీ స్టార్ హీరో సజెషన్ కారణంగా .. ఆమె తల్లి అయినట్లు ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . ఆయన ఎవరో కాదు సల్మాన్ ఖాన్ . బాలీవుడ్ కండల వీరుడు గా పేరు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ సలహా మేరకే ఆమె తల్లి అయింది అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . కాశ్మీరీ షాను సరోగసి ద్వారా బిడ్డలని కనమంటూ సజెస్ట్ చేశారట సల్మాన్ ఖాన్ . ఈ సలహా బాగానే ఉంది అంటూ అలా వాళ్ళు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే చాలామంది మాత్రం కాశ్మీరా గ్లామర్ కోసమే ఇలా సరోగసి ప్రాసెస్ ఎంచుకుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు ..!!