ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు ఎలా హాట్ హాట్ కంటెంట్ ఇస్తూ కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పుడు అంటే హీరోలకి ఎక్కువ ఇచ్చి..హీరోయిన్లకి తక్కువ ఇచ్చేవాళ్ళు . అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది . హీరోలతో సరి సమానంగా మాకు రెమ్యూనరేషన్ ఇవ్వాలి అంటూ పట్టు పడుతున్నారు హీరోయిన్స్ .
అంతే కాదు లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అంటూ తీసి హీరోలు లేకపోయినా సరే మేము హిట్ కొట్టగలము.. కలెక్షన్స్ రాబట్టగలము అంటూ ప్రూవ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే ఓ ఐటమ్ గర్ల్ మాత్రం నిమిషానికి కోటి రూపాయలు చార్జ్ చేస్తూ ఇండస్ట్రీని చెక్ చేస్తుంది . ఆమె మరి ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా. ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈమె పేరు మారుమ్రోగిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ నటించిన ఈమె .. ఆ తర్వాత అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమాలోని ఐటెం సాంగ్ చేసింది.
ఇప్పుడు పుష్ప2 సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేసిందట . బాస్ పార్టీ సాంగ్ కోసం మూడు కోట్లు తీసుకునిందట . ఈ క్రమంలోనే అమ్మడు నటించే మూడు నిమిషాల పాట కోసం ఏకంగా మూడు కోట్లు తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈ లెక్కను చూసుకుంటే నిమిషానికి ఓ కోటి ఆమె చార్జ్ చేస్తున్నట్లే . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారిపోయింది..!!