సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కొన్ని కొన్ని సార్లు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అందాల ముద్దగుమ్ముకు కూడా అలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయా..? అంటే అవునని అంటుంది స్టార్ హీరోయిన్ హేమమాలిని . తనకు అలాంటి ఓ చేదు అనుభవం ఎదురైందని ..ఓ డైరెక్టర్ తన విషయంలో తప్పుగా మాట్లాడారు అని ఓపెన్ గా చెప్పుకొచ్చింది . సీనియర్ నటి లోక్ సభ సభ్యురాలు హేమమాలిని తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి .
కాగ సినిమా ఇండస్ట్రీని తన అందచందాలతో ఏలేసిన హేమమాలిని .. ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా రాజకీయాలకు దగ్గరగా ఉంది. రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హేమమాలిని సంచలన కామెంట్స్ చేసింది . ఓ సినీ దర్శకుడు మాటల వల్ల తను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ..”నేను సినిమాలు చేస్తున్న టైంలో డైరెక్టర్ నాతో అసభ్యకరంగా మాట్లాడారు . ఆ విషయం ఇప్పటికి నేను మర్చిపోలేను . ఆ దర్శకుడు నాపై రొమాంటిక్ సీన్ తీయాల్సి ఉంది . ఈ క్రమంలోనే నేను చీర కట్టుకుంటున్నప్పుడు బయటకు పిన్ పెట్టుకున్నాను. అయితే ఆయన పిన్ పెట్టుకోవద్దు అంటూ చెప్పాడు “.
“ఒకవేళ పిన్ పెట్టకపోతే చీర జారిపోతుంది కదా అంటూ అడిగాను ..నాకు కావాల్సిందే అదే అంటూ పచ్చిగా చెప్పాడు . దీంతో నేను షాక్ అయిపోయాను ..కంగారు పడ్డాను ” అంటూ హేమమాలని ఓపెన్ గా తనకు ఎదురైన బ్యాడ్ ఇన్సిడెంట్ ని బయటపెట్టింది . దీంతో హేమమాలిని సైతం ఇలాంటి టార్చర్ కి గురైందా అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ హేమమాలిని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే హేమమాలినితో అలా మాట్లాడింది ఓ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అంటూ ప్రచారం జరుగుతుంది..!!