Moviesశ్రీజ‌ వల్ల చిరుకు ఇప్పటికీ ఇబ్బందులేనా...ఇన్ని కోట్లు ఆస్తులు ఇచ్చేశారా..!

శ్రీజ‌ వల్ల చిరుకు ఇప్పటికీ ఇబ్బందులేనా…ఇన్ని కోట్లు ఆస్తులు ఇచ్చేశారా..!

మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన అజాత శత్రువు అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తనను తిట్టిన వారినైనా ఆప్యాయంగా పలుకరించే మనస్తత్వం ఆయనది. వివాదాల జోలికి పోని సున్నిత మనస్కులు ఆయన. అందుకే రాజకీయాల్లోకి వచ్చినా ఇమడలేకపోయారు. తిరిగి తనకు ఎంతో పేరు తీసుకొచ్చిన సినిమాల్లోకి వెళ్లిపోయారు. ఈ మకుటం లేని మహారాజు జీవితంలో అసంతృప్తి ఏదైనా ఉంది అంటే అది చిన్న కుమార్తె శ్రీజ జీవితమే.

ఆ అమ్మాయి చదువుకునే రోజుల్లో శిరీష్ భరద్వాజ్ అనే యువకుడిని ప్రేమించింది. హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుంది. ఆ వెంటనే ఢిల్లీ వెళ్లిపోయింది. ఆ సమయంలో చిరంజీవి కుమిలిపోయారు. తనకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇతర కుటుంబ సభ్యుల వల్ల ప్రాణహాని ఉందని శ్రీజ ఆరోపించడం ఆమె కుటుంబ సభ్యులను బాగా కుంగదీసింది. అయితే కొన్నాళ్లకే శ్రీజ, శిరీష్ మధ్య విభేదాలు వచ్చాయి.

భర్తతో విభేదాలు రాగానే తండ్రి చిరంజీవికి ఫోన్ చేసి ఆమె ఏడ్చేదట. ఆస్తి కోసం తనను బాగా ఇబ్బంది పెడుతున్నాడని, కొడుతున్నాడని ఆమె ఏడుస్తుండడంతో చిరంజీవి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారట. చివరికి దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఆమె తండ్రి చెంతకు చేరింది. తన వద్దకు వచ్చిన చిన్న కుమార్తె శ్రీజను చిరంజీవి ఎంతో ఆప్యాయంగా చేరదీశారు.

అందరిలోనూ చిన్నది కావడంతో ఆమె అంటే చిరంజీవికి చాలా ఇష్టమట. అయితే శ్రీజ విడాకులు తీసుకోగానే ఆమె జీవితాన్ని చక్కదిద్దాలని భావించారు చిరంజీవి. తర్వాత కళ్యాణ్ అనే యువకుడికి ఇచ్చి ఆమెకు రెండో వివాహం అంగరంగ వైభవంగా చేశారు. కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య కూడా పొరపచ్చాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఎంత గారాబంగా పెంచుకున్న కుమార్తె జీవితం ఇలా అవుతుండడంతో చిరంజీవిలో చాలా బాధ ఉందట.

ఇక ఆమెకు తన సంపాదనలో నుంచి కొంత మొత్తం చొప్పున ఆస్తులు రాస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో రూ.35 కోట్ల విలువైన ఓ ఇంటిని చిరంజీవి చూశారట. అది బాగుండడంతో వెంటనే డబ్బు చెల్లించి దానిని తన చిన్న కుమార్తె శ్రీజ పేరిట రాసిచ్చారట. ఇలా తనను ఎంతో బాధపెట్టిన కుమార్తెను సైతం చిరు చాలా ప్రేమగా చూసుకుంటున్నారనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news