Moviesమ‌హేష్‌బాబుకు అప్పుడే రాజ‌మౌళి టార్చ‌ర్ స్టార్ట్‌... ఇంత దారుణంగానా...!

మ‌హేష్‌బాబుకు అప్పుడే రాజ‌మౌళి టార్చ‌ర్ స్టార్ట్‌… ఇంత దారుణంగానా…!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు – మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న‌ సినిమా సెట్ మీద వుండగానే, రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ ప‌నులు కాగితాల మీద రెడీ చేసుకుంటున్నార‌ట‌. ఈ ద‌స‌రా త‌ర్వాత ఆ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌వ‌చ్చ‌ని అంటున్నారు. రాజ‌మౌళి – మ‌హేష్‌బాబు కాంబినేష‌న్లో తెర‌కెక్కే సినిమా ఫుల్ యాక్షన్ సినిమాగా ఉంటుందని వార్తలు వున్నాయి.

ఈ సినిమా కోసం రాజమౌళి మూడు నెలలపాటు మహేష్ బాబు ను ఓ రేంజ్‌లో టార్చ‌ర్ పెట్ట‌బోతున్నాడ‌ట‌. అంటే మూడు నెల‌ల పాటు మ‌హేష్ కోసం ఓ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన‌ట్టు తెలిసింది. అయితే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇండియాలో ఉంటుందా ? విదేశాల్లో వుంటుందా? అన్న క్లారిటీ లేదు. అయితే ఈ యేడాది చివ‌ర్లో లేదా వ‌చ్చే సంక్రాంతి టైం నుంచి ఇది స్టార్ట్ అవుతుంద‌ని తెలుస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ట్రైనింగ్ షెడ్యూల్ మార‌కూడ‌ద‌ని రాజ‌మౌళి ఇప్ప‌టికే మ‌హేష్‌కు కండీష‌న్ కూడా పెట్టాడ‌ట‌. అందుకే మహేష్-త్రివిక్రమ్ సినిమాకు నవంబర్ నాటికి పూర్తి చేయాలని ఉరుకులు ప‌రుగులు పెడుతున్నార‌ట‌. అందుకే మ‌హేష్ కూడా త్రివిక్ర‌మ్ సినిమా కోసం ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు.

ఇక రాజ‌మౌళి సినిమాకు ముందే ట్రైనింగ్‌లో పాల్గొంటే హీరో ఆ పాత్ర‌లో ఒదిగిపోతాడ‌న్న‌దే మ‌నోడి కాన్సెఫ్ట్? త్రిబుల్ ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రూ కూడా ముందుగానే ట్రైనింగ్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా రాజ‌మౌళి అప్పుడే మ‌హేష్‌కు టార్చ‌ర్ స్టార్ట్ చేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news