Moviesఅమ్మ అంటే ప్రాణం ఇచ్చే మహేశ్..ఆమె చనిపోయిన ఎందుకు ఆ పని...

అమ్మ అంటే ప్రాణం ఇచ్చే మహేశ్..ఆమె చనిపోయిన ఎందుకు ఆ పని చేయలేదు..?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంత మంచి వ్యక్తో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సహాయం అడిగితే కాదు అడగకుండానే చేసే మంచి మనసున్న హీరో . ఎంతో మంది చిన్న పిల్లలకు గుండె జబ్బుల నుంచి నయం చేసి.. వాళ్లకు ఎంతో చక్కటి లైఫ్ అందిస్తున్న హీరో మహేష్ బాబు తన తల్లి చివరి కోరికను కూడా తీర్చలేకపోయాడు అన్న వార్త ఇప్పుడు అభిమానులకి మరింత స్థాయిలో బాధాకరంగా ఉంది . మనకు తెలిసిందే మహేష్ బాబు అమ్మగారు ఇందిరా దేవి గారు రీసెంట్ గానే మరణించారు .

అయితే ఆ బాధను భరించలేక కొన్నాళ్లపాటు డిప్రెషన్ కి గురైన మహేష్ బాబు .. ఆ తర్వాత మళ్లీ సినిమాల మూడ్ లోకి వచ్చేసారు . కాగా ప్రెసెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న మహేష్ బాబు ..ఆ తర్వాత రాజమౌళి తరకెక్కించబోతున్న సినిమాలో కూడా నటించబోతున్నారు . అయితే మహేష్ బాబు తన తల్లికి ఇష్టమైన పని కూడా చేయలేకపోయాడు అన్న వార్త అభిమానులకు చాలా చాలా హర్టింగా ఉంది .

మొదటినుంచి మహేష్ బాబు అమ్మగారికి సితార అంటే చాలా చాలా ఇష్టమట. అందుకే ఆమె బతికున్నప్పుడే సితారకు ఓణీల ఫంక్షన్ చేయమని చాలా రిక్వెస్ట్ చేసిందట . అయితే మొదటి నుంచి ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోని మహేష్ బాబు దానిపై ఇంట్రెస్ట్ చూపించలేదట. ఆఖరికి ఆ కోరిక తీరకుండానే ఆమె చనిపోయింది . అయినా సరే ఇప్పటికి మహేష్ బాబు ఆ ఫంక్షన్ చేయించి అమ్మ లేకపోయినా ఆ కోరికను తీర్చకుండా ..సైలెంట్ గా అయిపోయాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news