సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ప్లాన్ భళే చేంజ్ చేసేస్తున్నారు . అప్పటివరకు ఓ నిర్ణయం తీసుకున్న.. అప్పటికప్పుడు సమయానుసారం రూట్ మార్చేస్తూ స్టార్ హీరోని ఇబ్బంది పెట్టేస్తున్నారు. కెరియర్ స్టార్టింగ్ లో హిట్ల కోసం నానా తంటాలు పడిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అంతేకాదు మృణాళ్ ప్రెసెంట్ చేతులో ఐదు బడా ప్రాజెక్ట్స్ ను పట్టుకొని ఉంది .
అందులో ఒకటే విజయ్ దేవరకొండ తో నటిస్తున్న సినిమా కూడా కావడం గమనార్హం. కాగ బాలీవుడ్ లో రీసెంట్గా లస్ట్ స్టోరీస్ లో నటించిన మృణాల్ ఠాకూర్ తెలుగులో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ చిత్రాల్లో నటిస్తుంది . కాగా మృణాల్ ని విజయ్ తిన్నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారు మేకర్స్. నిజానికి ఈ పాత్ర కోసం పూజ హెగ్డే ని అనుకున్నారట .
కానీ లాస్ట్ మూమెంట్లో పూజ హెగ్డే ని తీసేసి మృణాల్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది . అయితే ఆ కనికరం కూడా లేకుండా మృణాల్ ఠాకూర్ మేకర్స్ కి చుక్కలు చూపిస్తుందట . అంతేకాదు కమిట్ అయినప్పుడు ఓ రెమ్యూనరేషన్ మాట్లాడుకున్న మృణాల్..కమిట్ అయిన తరువాత మరో రెమ్యూనరేషన్ ని అడుగుతుందట. ఒక్కొక్క సినిమాకి కోటి 50 లక్షలు నుంచి రెండు కోట్లు అంటుకుంటుంది మృణాల్.
అయితే ఈ సినిమాకి మాత్రం అమ్మడు ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేసిందట. దానికి కారణం ఈ సినిమాలో విజయ్ తో లిప్ లాక్ సీన్ ఉండడమే అంటూ తెలుస్తుంది. అయితే విజయ్ దేవరకొండ అడిగి మరీ కోరి ఆమె పేరుని సజెస్ట్ చేశారట . అయితే ఇలా లాస్ట్ మూమెంట్లో మృణాల్ ప్లాన్ మార్చేయడంతో విజయ్ తీవ్ర డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాదు అమ్మడు ఇలాగే చేస్తే ఈమెను తీసేసి పూజా నే పెట్టుకుంటారట. చూడాలి మరి మృణాల్ ఏం చేస్తుందో..?