సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురయ్యే టాప్ సెలబ్రిటీ ఎవరు అంటే కళ్ళు మూసుకొని అడిగిన నిద్రలో చెప్పే ఒకే ఒక పేరు మెగా డాటర్ శ్రీజ . మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కూతురు శ్రీజ తన మొదటి భర్త శ్రిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చాక విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే . అయితే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట విని మంచి సంబంధంతో రెండో పెళ్లి చేసుకున్న శ్రీజ అతగాడికి విడాకులు ఇచ్చేసింది .
అఫీషియల్ గా ఈన్యూస్ బయటికి రాకపోయినా చూస్తున్న దృశ్యాలు ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండోసారి కూడా విడాకులు తీసుకుంది అని కన్ఫామ్ అయిపోతున్నారు జనాలు. అయితే మొదటి భర్త విడాకులు తీసుకున్న తర్వాత శిరీష్ భరద్వాజ్ శ్రీజ ఏ విధంగా టార్చర్ చేయలేదు.. హింసించలేదు . తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోయాడు. కానీ కళ్యాణ్ దేవ్ మాత్రం మెగా కూతురు శ్రీజకు దిమ్మ తిరిగిపోయే కౌంటర్స్ ఇస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తాను పడ్డ బాధలను ఓపెన్గా చెప్పుకొస్తూ ..పరోక్షకంగా శ్రీజ పై కౌంటర్స్ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే మెగా ఇంటి అల్లుడికి చాలా ధైర్యం అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు. అంతేకాదు సాధారణంగా మెగా ఫ్యామిలీతో పెట్టుకోవాలని ఎవరూ చూడరు. ఎందుకంటే ఇండస్ట్రీలో అంత పేరు పలుకుబడి ఉన్న ఫ్యామిలీ కాబట్టి . కానీ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే తనను టార్చర్ చేసిన శ్రీజను సోషల్ మీడియా వేదికగా ఏకపారేస్తున్నారు కళ్యాణ్ దేవ్.
ఇప్పటికే చాలాసార్లు పలు రకాల ట్వీట్స్ తో ఆమెను పరోక్షంగా టార్గెట్ చేసిన కళ్యాణ్ దేవ్ రీసెంట్గా మరోసారి తనదైన స్టైల్ లో మెగా డాటర్ కు ఇచ్చి పడేశారు . “జీవితంలో మర్చిపోలేనివి చాలా ఉంటాయి ..అలాంటి వాటిని వదులుకునే ధైర్యం తెచ్చుకున్నప్పుడే అవి మనకి మధుర క్షణాలుగా ఉంటాయి. మీరు ఏమంటారు ..? అంటూ రాసుకు వచ్చాడు”. దీంతో కళ్యాణ్ దేవ్ శ్రీజ పైన కౌంటర్ ఇచ్చాడు అంటూ చెప్పుకొస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!