సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రిటీస్ అభిమానులతో ఎక్కువగా చిట్ చాట్ చేస్తున్నారు . క్షణం తీరిక దొరికిన సరే ఇంస్టాగ్రామ్ వేదికగా ఆస్క్ నమీ ఎనీ ధింక్ అనే సెషన్ ని కండక్ట్ చేస్తున్నారు . రీసెంట్గా టాలీవుడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న చందమామ కాజల్ అగర్వాల్ సైతం అలాంటి పనే చేసింది. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో లై సెషన్ లో పాల్గొనింది .
ఈ క్రమంలోనే అమ్మడును రకరకాల ప్రశ్నలతో విసికెత్తించేశారు అభిమానులు . అయితే వాళ్లందరికీ చాలా ఓపికగా ఆన్సర్ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ని ఓ నెటిజన్ చాలా వింత ప్రశ్న అడిగారు . “మీరు ఉదయం నిద్ర లేవగానే బెడ్ పైన చేసే ఫస్ట్ పని ఏంటి..?” అంటూ ఓపెన్ గానే అడిగేసాడు . ఈ క్రమంలోనే కాజల్ సైతం ఏమాత్రం మొహమాట పడకుండా ఓపెన్ గా చెప్పుకొచ్చింది .
“నేను నిద్ర లేవగానే ముందు నా భర్తకి ..నా కొడుక్కి హగ్ ఇచ్చి ముద్దు పెడతాను ..ఆ తర్వాత హాట్ వాటర్ తో నిమ్మకాయ పిండుకొని తాగుతాను ..ఆ తర్వాత యోగా చేస్తాను.. కొన్ని మంత్రాలు.. దేవుడి పాటలు వింటాను ..ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తాను..బాబు కి ఫీడ్ చేస్తాను.. ఒకవేళ షూట్ ఉంటే పరుగు పరుగున షూట్ కి రెడీ అవుతాను ” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది .
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కొందరు ఆమె సింప్లిసిటీ ఇష్టపడుతుంటే మరికొందరు బెడ్ పైన లేవడం లేవడమే మొదలుపెట్టేస్తావా..? అంటూ పిచ్చిగా వల్గర్ ట్రోల్ చేస్తున్నారు..!!