Movies"ఈ రోజుల్లో ఏ అమ్మాయి అలా లేదు".. స్త్రీల లైంగిక సంతృప్తి...

“ఈ రోజుల్లో ఏ అమ్మాయి అలా లేదు”.. స్త్రీల లైంగిక సంతృప్తి పై కాజోల్ బోల్డ్ కామెంట్స్..!!

కాజోల్ ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . బాలీవుడ్ ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేసిన ఈ బ్యూటీ ..బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్నింది. కాజోల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో రాణిస్తూ ఏలేసిన ఈ బ్యూటీ ప్రెసెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లోను టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది . రీసెంట్ గానే లస్ట్ స్టోరీస్ 2 లో నటించి తన నటనను తన అందాన్ని మరోసారి అభిమానులకి పరిచయం చేసిన కాజోల్ లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆడవాళ్ళ లైంగిక సంతృప్తిపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి .

కాగా కాజోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది . ఈ క్రమంలోనే సెక్స్ డిజైర్ లవ్ ను అన్వేషించే నాలుగు కథలు సంకలనంగా ఈ సిరీస్ తెరకెక్కింది . ఈ క్రమంలోనే ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాజోల్ బోల్డ్ గా స్పందించింది . “ఒకప్పుడు సినిమాలో రొమాన్స్ సీన్ అంటే రెండు పువ్వులను దగ్గరగా చూపించి.. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినట్లు చూపించేవారు . కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. అన్ని ఓపెన్ గానే చూపిస్తున్నారు.. అందుకే మేము కూడా ఒక అడుగు ముందుకేసి లస్ట్ స్టోరీస్ 2 లో అలాగ చేయాలని డిసైడ్ అయ్యాం”.

” పాత్రలో బోల్డ్ గా ఉన్న అవి నిజాన్ని ప్రతిబింబిస్తాయి . అందుకే నేను ఈ లస్ట్ స్టోరీస్ 2 చేశాను. ఒకప్పుడు ప్రేమ కోసం చనిపోయే కధలని ఎక్కువగా చూపించేవాళ్లు . ఈ రోజుల్లో అలా ఎవ్వరూ లేరు . ఒకరు కాకపోతే మరొకరు.. మల్టిపుల్ సోల్మేట్స్ అనేది ఎక్కువగా నమ్ముతున్నారు నేటి యువత. అదే బెస్ట్ కూడా.. ఒకరు కాకపోతే మరొకరు అనే పాలసీ ఉంటేనే లైఫ్ లో ముందుకెళ్లగలం” అంటూ బోల్డ్ గా స్పందించింది . దీంతో కాజల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news