ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రామ్ చరణ్ – ఉపాసన పేర్లే బాగా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు కావడంతో ఇంత హంగామా నడుస్తుంది . సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వారి పేర్లే మారుమ్రోగిపోవడానికి కారణం ఇదే. మెగాస్టార్ చిరంజీవి ఒక గాన ఒక కొడుకు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అని తెలియడంతో అప్పటినుంచి కచ్చితంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సైతం కొడుకు పుడతాడని మెగా ఫ్యామిలీ వారసత్వాన్ని కొనసాగిస్తారని అంతా అనుకున్నారు .
అయితే పాప పుట్టింది. ఈ క్రమంలోనే చరణ్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఉపాసన ప్రెగ్నెంట్ అయిన మూడో నెలలోనే జాతకం చూపిస్తే పాపపడుతుంది అని చెప్పారట . అంతేకాదు వారసుడు పుట్టాలి అంటే “పుత్ర కామేష్టి యాగం” చేయించాలి అని చెప్పుకొచ్చారట . అయితే దీనిపై ఉపాసన -చరణ్ ఫైర్ అయ్యారట.
మాకు పాప అయినా.. బాబు అయిన ఒకటే ..ఇలాంటివంతా మేము చెయ్యం ..ఎవరైనా మాకు వారసులే అంటూ తెగేసి చెప్పారట . ఆ కారణంగానే రామ్ చరణ్ కి పాప పుట్టింది అన్న రూమర్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఏది ఏమైనా మెగా ప్రిన్సెస్ విషయంలో జనాలు ఎక్కువుగా ఆలోచిస్తున్నారు. అన్నది మాత్రం వాస్తవం..!!