Moviesచరణ్ కి పాప పుట్టిందోచ్.. ఆనందంలో ఎన్టీఆర్ ఏం చేసాడో తెలుసా.....

చరణ్ కి పాప పుట్టిందోచ్.. ఆనందంలో ఎన్టీఆర్ ఏం చేసాడో తెలుసా.. ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే..!!

టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ తండ్రి అయ్యాడు. మెగా కోడలు ఉపాసన కొద్ది గంటల క్రితమే అపోలో హాస్పిటల్స్ లో పండంటి పాపకు జన్మనిచ్చింది . ఈ క్రమంలోనే గత పదేళ్లుగా మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రావడంతో మెగా ఇంట సంబరాలు షురూ అయ్యాయి .

మెగా ఫాన్స్ మొత్తం రాంచరణ్ ఉపాసనకు కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు. ఈ క్రమంలోని సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీస్ పలువురు ఫ్రెండ్స్ రాంచరణ్ – ఉపాసనకు స్పెషల్గా విష్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ జాన్ జిగిడి దోస్త్ అయిన తారక్ – ఉపాసనకు – రాంచరణ్ కు స్పెషల్గా విష్ చేశారు . “వెల్కమ్ టు ది పేరెంట్స్ క్లబ్” అంటూ..” మీ పాపతో మీరు ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్ కూడా మీకు లైఫ్ లో గుర్తుండిపోతుంది అని ..ఆ దేవుడి మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలి” అంటూ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసాడు.

ఈ క్రమంలోని సోషల్ మీడియాలో తారక్ పెట్టిన పెట్టిన ట్రెండ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. గత కొన్ని రోజులుగా వీళ్లిద్దరి మధ్య యవ్వారం బాగోలేదని వాళ్ళిద్దరూ మధ్య ఫైట్ జరుగుతుందని వార్తలు వినిపించాయి. ఈ ఒక్కదానితో ఆ వార్తలంతా ఫేక్ అంటూ కొట్టి పడేసారు . అంతేకాదు ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియగానే తన ఇంటి తరుపున తన చెల్లి అని భావించి పట్టు చీర, గాజులు, పూలు, పండ్లతో సారె పంపించాడు తారక్. ప్రజెంట్ తారక్ ట్వీట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news