సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ప్రెసెంట్ రెబల్ హీరో ప్రభాస్ నటించిన ఆది పురుష్.. సినిమా పోస్టర్.. సినిమా టాక్ గురించి చర్చించుకుంటున్నారు జనాలు. కాగా బాలీవుడ్ స్టార్ట్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీ వద్ద హ్యూజ్ కలెక్షన్స్ రాబట్టి సినిమా ఇండస్ట్రీ లెక్కలను తిరగరాస్తుంది .
ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి . కాగా ఆది పురుష్ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ప్రభాస్ , ఓం రావత్ ని ఏకీపారేశారు కొందరు జనాలు ..అసలు రాముడి పాత్రలో ప్రభాస్ సెట్ అవ్వడని ..ఈ సినిమాను చేయడం దండగని.. ఆ గ్రాఫిక్స్ చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్ లో లా ఉన్నాయి అంటూ ట్రోల్ చేశారు .
సినిమా రిలీజ్ అయిన తర్వాత కొందరు జనాలు కూడా ఇదే కామెంట్స్ ను ట్రోల్ చేస్తున్నారు . కాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా హాల్ ల వద్ద కొందరు రివ్యూలు అంటూ ప్రభాస్ సినిమాని ఏకిపారేస్తున్నారు. నెగటివ్ రివ్యూలతో ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో సైతం నెగటివ్ ట్వీట్స్ పెట్టి ప్రభాస్ ఇమేజ్ ని ఆది పురుష్ కు నెగిటివ్ టాక్ ను క్రియేట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ఎవరైతే నెగటివ్ ట్విట్స్ పెట్టారో వాళ్ళు ఆ ట్వీట్స్ డిలీట్ చేస్తే ఆదిపురుష్ టీం డబ్బులు ఇస్తాము అంటూ చెప్పుకొస్తుందట .
ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ న్యూస్ పై మండిపడుతున్నారు. ప్రభాస్ కి అలాంటి కర్మ పట్టలేదని ..? సినిమా చాలా బాగుంది అని ..సినిమా పాజిటివ్ రివ్యూ తో ముందుకు వెళ్తుందని.. ఎవరో పనీపాట లేని వాళ్ళు ఇలా నెగటివ్ ట్వీట్స్ చేస్తున్నారని.. ఆదిపురుష్ అంతకు దిగజారిపోలేదని ..అలాంటి చీప్ పనులు ఆది పురుష్ చేయదు అంటూ చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఆదిపురుష్ పేరు వైరల్ గా మారింది..!!