సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఎదురే లేకుండా సక్సెసఫుల్ గా దూడుకుపోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు ఓ కొత్త చిక్కు వచ్చి పడింది. పవన్ ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాల్లోనూ ఎవరితో వేలెత్తి చూపించుకునే పరిస్థితి ఆయనకు లేదు. ఆ పరిస్థితి ఏంటంటే… పవన్ పర్సనల్ లైఫ్ అదేనండి పవన్ మూడు పెళ్ళిళ్ళు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ఆయన కెరియర్ కి మాయని మచ్చగా మారింది.
ఇప్పటికే ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చిన పవన్ ప్రస్తుతం అన్నా లెజీనోవాని మూడో భార్యగా చేసుకున్నాడు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా… ప్రస్తుతం వీరిద్దరి మధ్య విబేధాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వివాదం మరింత ముదిరి విడాకుల వరకు వెళ్లిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలు ఈ వివాదానికి కారణం ఇదే అంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే…ఇటీవల ఓ నిరుపేద కుటుంబం పవన్ కల్యాణ్‌ను కలిసి తమకు సాయం చేయాలని అడిగారట. దీంతో వారికి పవన్ ఆర్థికసాయం చేసినట్టు తెలుస్తోంది. చాన్నాళ్ల నుంచి ఇలాంటివి గమనిస్తున్నలెజీనోవా మీలో సేవా గుణం ఉండొచ్చుకానీ.. మరీ ఇంతలా కాదండని సలహా ఇచ్చిందంట.
నేనింతే.. సేవలు, దానాలు చేస్తూనే ఉంటా.. అంటూ అన్నా లెజీనోవోతో పవన్ అన్నాడట. ఆ వివాదమే మరింత ముదిరి విడాకుల వరకు వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఇదంతా వట్టి పుకారు అని ఇదంతా రాజకీయ కుట్ర అంటూ కొట్టిపారేస్తున్నారు.