Movies"1,2 కాదు ఏకంగా ఏడు సార్లు చేశారు".. సంచలన విషయాలను బయటపెట్టిన...

“1,2 కాదు ఏకంగా ఏడు సార్లు చేశారు”.. సంచలన విషయాలను బయటపెట్టిన అవికా గోర్..!!

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న “అవికా గొర్” గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ టాలీవుడ్ లో ప్రత్యేక పాపులారిటీ సంపాదించుకునింది. తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు కూడా చేసింది . కాగ కొన్ని సినిమాలు హిట్ అవ్వగా మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి . అయితే సినిమాల కంటే సీరియల్ లోనే పాపులారిటీ ఎక్కువ సంపాదించుకున్న అవికా గోర్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ స్టేటస్ రావడానికి ఇప్పటికి కష్టపడుతూనే ఉంది.

అయితే ఆమె అది అందుకుంటుందా..? లేదా..? అన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవికాగోర్ తన సీరియల్స్ కు సంబంధించిన విషయాలను బయటపెట్టి తెగ నవ్వుకున్నింది. ఈ క్రమంలోనే ఆమె నటించిన ఓ సీరియల్ లో ఆమెకు ఏడుసార్లు పెళ్లి చేశారట. అంతేకాది.. మూడుసార్లు హీరోతో చేయడం..ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టులతో చేయడం .. ఆ తరువాత మూడుసార్లు చనిపోయినట్టు నటించమన్నారని.. ఆత్మతో మాట్లాడుతున్నట్లు యాక్ట్ చేయ మన్నారని.. ఆ టైం నాకు చాలా నవ్వొచ్చిందని చెప్పుకొచ్చింది .

అంతేకాదు అవికా గోర్ ఇంకా మాట్లాడుతూ..”స్టార్ పవర్ అంటేనే సౌత్. సౌత్ లో స్టార్స్ మీదే సినిమాలు నడుస్తాయి. సౌత్ లో నెపోటిజం చాలా ఎక్కువే. కానీ ఇక్కడి ప్రేక్షకులు చూస్తున్నట్టు అక్కడి వాళ్ళు చూడరు. ఇటీవల బాలీవుడ్, హిందీ సినిమాలపై తీవ్ర వివక్షత వచ్చేలా చేశారు. ఎంతలా అంటే.. సౌత్ సినిమాలు చాలా రీమేక్ చేస్తూ బాలీవుడ్ వాళ్ళు సౌత్ సినిమాలను కాపీ కొడతారు అనే స్థాయికి తీసుకొచ్చారు. సౌత్ లో ముఖ్యంగా తెలుగులో నెపోటిజం చాలా ఎక్కువే ఉంది” అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడు మాటలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news