Moviesసైలెంట్ షాక్ : పెళ్ళి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్ .. వరుడు...

సైలెంట్ షాక్ : పెళ్ళి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్ .. వరుడు రిచ్చో రిచ్చు..ఎవరో తెలుసా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు అందరూ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ – కోలీవుడ్ -హాలీవుడ్ – మాలీవుడ్ లో ఉండే అందాల ముద్దుగుమ్మలు వరుసగా పెళ్లి న్యూస్లను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. క్రేజీ క్రేజీ గుడ్ న్యూస్ లు చెప్తున్నా టైంలో మరో తెలుగు బ్యూటీ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోవాలి అని ఆలోచిస్తుంది. ఎస్ త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోయిన్లలో ఒకరుగా పేరు సంపాదించుకున్న మేఘ ఆకాస్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.

కాగా.. 2017 లో లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ .. ఆ తర్వాత చల్ మోహన్ రంగా , పేట చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అయితే అమ్మడు దురదృష్టమో ఏమో కానీ ఆమె నటించిన ప్రతి సినిమా వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి . ఇటీవల మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమాలోనెగిటివ్ పాత్రలో కనిపించింది. ఈ ప్రాజెక్టు కూడా డుంకి కొట్టేసింది .

దీంతో ఇక సినిమాలు సెట్ అవ్వని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోవాలని డిసైడ్ అయిందట మేఘ . ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు కుమారుడితో మేఘ ఆకాష్ పెళ్లి ఫిక్స్ అయినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి . వీరి వివాహం పెద్దలు కుదిరించిన వివాహమే అంటూ తెలుస్తుంది . త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ వార్తపై మెగా ఆకాశ్ స్పందించకపోవడంతో ఇది నిజమే అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు . దీంతో మీడియాలో మేఘ పెళ్లి వార్త వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news