టాలీవుడ్ రెబల్ హీరో గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమా ..ప్రాజెక్టుకే . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అస్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది . అంతేకాదు అమితాబచ్చన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు . హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య షూటింగ్ కంప్లీట్ చేసుకుని 2024 జనవరి 12వ తేదీ రిలీజ్ కి సిద్ధమవుతున్న ప్రాజెక్ట్ కే సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
అంతేకాదు ఒక్కసారిగా ఈ న్యూస్ ట్రెండ్ అవుతుండటంతో సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ఏర్పడింది ప్రాజెక్టు కె మూవీకి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మరో కీలకపాత్రలో మల్టీ టాలెంటెడ్ లోకనాయకుడు కమలహాసన్ నటించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఎస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ప్రాజెక్టు కే సినిమాలో కమలహాసన్ విలన్ పాత్రలో నటించబోతున్నాడట .
ఎంతలా అంటే సినిమాని మొత్తం మలుపు తిప్పే పాత్ర కమలహాసన్ ది అంటున్నారు . సినిమాలో భారీ తారగాణం ఉన్నా కానీ అందరికన్నా కమలహాసన్ పాత్ర హైలెట్ గా మారబోతుందని.. మరీ ముఖ్యంగా కమలహాసన్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే లేనివిధంగా డిజైన్ చేశారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా కోసం ఏకంగా 150 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడు కమల్ హాసన్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. హీరోకి సమానంగా ఆయన రెమ్యూనరేషన్ అడుగుతున్నాడు అంటే ఆ పాత్రలో ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు కమలహాసన్ ఫ్యాన్స్ . దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!