జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎన్టీఆర్ కు తగిన భార్యగా ప్రణతి గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు ఇంటికి సంబంధించిన అన్ని బాధ్యతలను ఆమె చూసుకుంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు లక్ష్మీ ప్రణతితో పెళ్లి జరిగిన తర్వాత కొన్నేళ్ల పాటు జూనియర్ ఎన్టీఆర్ కు అదృష్టం ఏ మాత్రం కలిసిరాలేదు. ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలు డిజాస్టర్ రిజల్ట్ సొంతం చేసుకున్నాయి.
ఊసరవెల్లి సినిమా నుంచి రభస సినిమా వరకు జూనియర్ ఎన్టీఆర్ కు వరుస షాకులు తగిలాయనే సంగతి తెలిసిందే. మధ్యలో ఒక్క బృందావనం మాత్రమే యబో యావరేజ్. అయితే ఎన్టీఆర్ భార్యపై కూడా ఆ సమయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ఎన్టీఆర్ భార్య వల్ల ఆయనకు అదృష్టం కలిసిరాలేదని అదే సమయంలో కెరీర్ పరంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో ప్రణతి కూడా ఫీలయ్యారని సమాచారం.
ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో జయాపజయాలు సాధారణం అని నెగిటివ్ కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమెకు చెప్పారట. లక్ష్మీ ప్రణతి చాలా సెన్సిటివ్ అని నెగిటివిటీ ఆమెకు నచ్చదని ఈ రీజన్ వల్లే ఇంటర్వ్యూలలో కూడా ఆమె కనిపించరని సమాచారం. తర్వాత రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు వరుస విజయాలు లభించడంతో ప్రస్తుతం లక్ష్మీ ప్రణతి తారక్ కు అదృష్ట దేవత అని చెబుతున్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా తారక్ భార్య గురించి గొప్పగా కామెంట్లు చేశారు. ప్రణతి నాకు దేవుడిచ్చిన వరం అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పారంటే ఆమెపై తారక్ కు ఏ స్థాయిలో ప్రేమ ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ స్క్రిప్ట్ మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల కానుంది.