Moviesకత్రినా భర్త కు ఘోర అవమానం.. అందరిలోనే అలాంటి పని చేసిన...

కత్రినా భర్త కు ఘోర అవమానం.. అందరిలోనే అలాంటి పని చేసిన సల్మాన్ ఖాన్..బాలీవుడ్ లో కొత్త వార్ స్టార్ట్..!!

ఇది నిజంగా కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ కు ఘోర అవమానమనే చెప్పాలి . అంతమంది స్టార్స్ మధ్య కత్రినా కైఫ్ భర్తను నెట్టిపడేసింది సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ బృందం . ప్రెసెంట్ దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మనకు తెలిసిందే అందాల ముద్దుగుమ్మ కత్రీనా బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న విక్కి కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే సల్మాన్ ఖాన్ – కత్రినా కైఫ్ అంతకుముందే ప్రేమించుకున్నారని .. పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.

వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఇద్దరు విడిపోయారట. సల్మాన్ ఖాన్ పెళ్లికి కూడా భారీ గిఫ్ట్ పంపించినట్లు అప్పట్లో బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. సల్మాన్ ప్రస్తుతం ఐఫా మూవీ ఫెస్టివల్స్ కోసం అబుదాబి వెళ్లారు. అయితే అక్కడ సల్మాన్ ఖాన్ వెళ్లిన టైం లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సల్మాన్ ఖాన్ తో పాటు అదే ఈవెంట్ కు కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ కూడా అటెండ్ అయ్యారు .

ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ ని కలిసేందుకు విక్కీ కౌశల్ దగ్గరికి వెళ్తున్న తరుణంలో సెక్యూరిటీ అతగాడిని తోసేసింది. ఆశ్చర్యమేంటంటే సల్మాన్ ఖాన్ అది చూసినా సరే సెక్యూరిటీని ఏమీ అనలేదు . దీంతో అక్కడ అతగాడికి పరువు తీసినట్లైపోయింది. దీంతో సల్మాన్ ఖాన్ ని..ఆయన సిబ్బందిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు విక్కీ కౌశల్ ఫ్యాన్స్. స్టార్ హీరోని ఇంత ఘోరంగా అవమానిస్తారా..? మనసులో ఏదో పెట్టుకుని చేసాడు వీడు.. అంటూ సల్మాన్ ఖాన్ కి ఇచ్చి పడేస్తున్నారు. ఈ వీడియో పై విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్ ఎలా స్పందిస్తుందని ప్రశ్నార్ధకంగా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news