Moviesపవిత్ర లోకేష్ చెప్పిన ఆ "దుష్ట శక్తులు " వీరేనా..? ఘాటు...

పవిత్ర లోకేష్ చెప్పిన ఆ “దుష్ట శక్తులు ” వీరేనా..? ఘాటు పదాలతో ఉతికి ఆరేసిందిగా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్ నరేష్ – క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న పవిత్రల పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్లు కలిసి నటిస్తున్న సినిమా “మళ్లీ పెళ్లి”. ఎం ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 26న గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కాబోతుంది . ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ చురుగ్గా పాల్గొంటున్న పవిత్ర నరేష్ తమ పరసనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా హైదరాబాద్లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నరేష్ – పవిత్ర మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .

ఈ క్రమంలోని స్టేజి ఎక్కి మైక్ పట్టుకున్న పవిత్ర లోకేష్ మొదట ఎం ఎస్ రాజు కాళ్లకు నమస్కరించుకొని తన స్పీచ్ స్టార్ట్ చేసింది. “ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.. దేవుడు ఇచ్చిన లైఫ్ ఎలా జరిగితే అలాగే బ్రతికేయాలని డిసైడ్ అయ్యాను.. అంతేకాదు నాకు అదృష్టం ఇప్పుడే వచ్చింది.. మామూలుగా ఏ ఆడపిల్లకైనా చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంటుంది ..నాకు అలాగే ఉండింది. కానీ చిన్న వయసులోనే మా నాన్న చనిపోవడంతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను.. దాంతో ఒంటరిగానే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను .. నా స్థాయికి తగ్గ పాత్రలు చేసుకుంటూ కష్టపడి సంపాదించుకున్నాను. అప్పుడు ఇండస్ట్రీలో నన్ను చాలా దుష్ట శక్తులు ఆపాలని చూసాయి.. వారిని ఎదుర్కొంటూనే వచ్చాను . కానీ నా ఒక్కదాని వల్లే కాలేదు. అప్పుడే నాకు తోడుగా అండగా నిలబడ్డాడు నరేష్ . ఆయన పక్కన నిలబడినప్పటి నుంచి నాకు కలిసి వచ్చింది . ఇప్పుడు నన్ను కాపాడడానికి నా వెనక ఒక శక్తి ఉంది ..అదే నరేష్ “అంటూ చాలా బోల్డ్ గా మాట్లాడింది.

ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్ మాట్లాడుతూ “దుష్టశక్తులు” అన్న పదం వాడడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. నరేష్ గురించి అంత బాగా మాట్లాడిన పవిత్ర దుష్ట శక్తులు అన్న పదం ఎందుకు వాడింది ..? ఇంతకీ ఆ దృష్టశక్తులు ఎవరు ..? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా చర్చ నడుస్తుంది . అయితే సోషల్ మీడియాలో జనాలు పవిత్ర మాట్లాడిన దుష్టశక్తి అన్న పదానికి అర్థం నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అంటూ ట్రోల్ చేస్తున్నారు . వీళ్ల బంధానికి ఆమె అడ్డుగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే మరికొందరు పవిత్ర మొదటి భర్త సుచంద్రప్రసాద్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు . వీళ్ళే వాళ్ళ బంధానికి అడ్డుగా ఉన్నారని.. ఇండస్ట్రీలో కొందరు నరేష్ పవిత్ర జంటని అడ్డుకోవడానికి కూడా ట్రై చేశారట . ఇలా ఆ దుష్ట శక్తులు అన్నిటి నుంచి బయటపడి.. ఫైనల్లీ వాళ్ళ గమ్యం చేరుకున్నారు అని చెప్పకనే చెప్పేసింది పవిత్ర నరేష్ . ఏది ఏమైనా సరే స్టేజ్ ఎక్కి అంత ధైర్యంగా ఘాటుగా దుష్టశక్తులు అంటూ చెప్పుకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే పవిత్ర నరేష్ తమ బంధం పై మాట్లాడే వాళ్ళకి ఇచ్చిపడేసింది . చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హీట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news