నిర్మలమ్మ గురించి అందరికీ తెలిసింది కొంతే. చాలా తెలియాల్సి ఉంది. ఆమె రచయిత. అనేక సినిమా లకు మాటల సహకారం కూడా అందించింది. హీరో కృష్ణ తీసిన సూపర్ హిట్ మూవీ సింహాసనం కథ నిర్మ లమ్మ కూర్పే అంటే అందరూ ఆశ్చర్య పోతారు. కానీ, ఇది నిజం. అనేక సినిమాలకు ఆమె సహకారం అందించారు. అయితే.. ఎక్కడా పేరు వేసుకునేవారు కాదు. నాదేముంది బాబూ.. మీరు సహకారం ఇచ్చారు. అని చెప్పుకొనేవారు.
నిర్మలమ్మతో ఇండస్ట్రీ మొత్తానికి చాలా పరిచయం ఉండేది. ఆమెకు పిల్లలు లేరని అంటారు. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. దీంతో ఇండస్ట్రీలో అందరినీ తన పిల్లల మాదిరిగానే చూసుకునేవారు. షూటింగులకు వచ్చే సమయంలో కూరలు చేయించి మరీ ప్రత్యేకంగా తీసుకువచ్చేవారు. షూటింగ్ స్పాట్‌లో భోజనాల సమయంలో ఎవరికి ఏ కూరకావాలన్నా.. వడ్డించేవారట. ఎస్వీ కృష్నారెడ్డి దర్శకుడిగా తీసిన ఒక సినిమాలో వంకాయ కూర విషయం గుర్తుందా?
ఆ సినిమాలో వంకాయకూర సీన్లన్నీ కూడా నిర్మలమ్మ సలహాతోనే తీశారు. అంతేకాదు.. అప్పట్లో ఈ వంకాయ కూరపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పోటీ పెట్టి రూ.10 వేల విలువ చేసే చీరలు కూడా పంచారు. ఇవన్నీ నిర్మలమ్మ డైరెక్షన్‌లో నే సాగాయి. ఇదిలావుంటే.. అసలు టైటల్ విషయానికి వస్తే.. నిర్మలమ్మ రుచులను హీరో కృష్ణ చాలా మెచ్చుకునేవారు. మా ఇంట్లోనే ఉండిపోయి.. జీవితాంతం మాకు వండిపెట్టవూ.. అని చొరవ తీసుకునేవారు.
అలాంటి కృష్ణ ఒక సందర్భంలో నిర్మలమ్మతో గొడవ పడ్డారు. అదేదో పెద్ద గొడవ కాదు.. సరదా రగడ. సిం హాసనం షూటింగ్ జరుగుతోంది. నిర్మలమ్మ నాలుగు రకాల కూరలు వండుకువచ్చి స్పాట్‌లో అందరికీ పంచారు. అయితే.. బాగా తినేసిన కళాకారులు.. భుక్తాయాసంతో నడుం వాల్చారు. అంతే.. కృష్ణకు చిర్రెత్తుకొచ్చింది. షూటింగ్ స్పాట్‌లో నిద్రపోవడాన్ని సహించరు. దీంతో ఇదిగో నిర్మలమ్మా.. ఇక మీదట నీ కూరలు తీసుకువచ్చావో.. నిన్నే తీసేస్తా!
అని హెచ్చరించారు.
అంతే.. నిర్మలమ్మ అప్పటి నుంచి హీరో కృష్ణ సినిమాలకు వండుకుని వచ్చేవారు. అయితే.. ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన నెంబర్ 1 సినిమాలో హీరో కృష్ణ. కృష్ణారెడ్డి నిర్మలమ్మ వంటలంటే ప్రాణం పెడతారు. కానీ, ఆమె ఏమీ తీసుకురాకుండానే వచ్చారు. దీంతో విషయం బయట పడింది. అయితే.. కృష్ణ జోక్యం చేసుకుని.. అదేదో సరదాగా అయిపోయిందిలే. అయినా.. ఇది నేను డైరెక్ట్ చేయడం లేదుకదా.. రేపటి నుంచి తీసుకురా నిర్మలమ్మా.. అని అనేశారట.