మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ఫుల్ ఖుషిగా ఉన్నాడు. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు గురయ్యాక వచ్చిన రిపబ్లిక్ అంచనాలు అందుకోలేదు. తాజాగా వచ్చిన విరూపాక్ష మూవీ అంచనాలకు మించి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా రు. 100 కోట్ల మార్క్‌కు అతి చేరువులో ఉంది. ఈ సంవత్సరం వచ్చిన టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలలో విరూపాక్ష ఒకటిగా చేరింది.
కొత్త దర్శకుడు కార్తీక్ దండు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఈ పర్ఫెక్ట్ థ్రిల్లర్ అందించాడు. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇక విరూపాక్ష సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్ వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే తాను ఇష్టపడిన హీరోయిన్ల గురించి ఓపెన్ అవుతున్నాడు. అలాగే తన వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటున్నాడు.
ముఖ్యంగా స్టార్ హీరోయిన్ సమంత గురించి సాయి ధరమ్ తేజ్ చేసిన కామెంట్లు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇండస్ట్రీలోకి వచ్చాక తాను హీరోయిన్ల పట్ల ప్రేమాభిమానాలు, ఇష్టం పెంచుకున్నానని కొందరు హీరోయిన్లను ఏకంగా ప్రేమించానని సాయి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సమంతను ఉద్దేశిస్తూ ఒక వ్యక్తిగా ఆమె నన్ను ఎట్రాక్ట్ చేసింది.. సమంతా అంటే నాకు పిచ్చ ఇష్టం.. ఇక కెరీర్ బిగినింగ్‌లో తనతో నటించిన సయామీకేర్ – రెజినా అన్న కూడా ఇష్టమని సాయి చెప్పాడు.
ఇక తిక్క సినిమాలో నటించిన లారీసా బోనేసిని అయితే చూడగానే సాయిధరమ్ తేజ్ ఇష్టపడిపోయాడట. షూటింగ్‌లోనే నువ్వంటే ఇష్టం ఇద్దరం కలిసి డేటింగ్ చేద్దామా ? అని నేరుగా అడిగేసాడట. అయితే ఆమె తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని సాయి తేజ్ కు సారీ చెప్పింది అట. ఇక సమంత అంటే చాలా ఇష్టం అని.. ఆమె అంటే పిచ్చ క్రష్ అని గట్టిగా చెప్పాడు.
ఇక కాలేజ్ డేస్‌లోనూ తనకు ప్రేమలు ఉన్నాయని ఓపెన్‌గానే అన్నాడు. సాయితేజ్ చేసిన కామెంట్లు చూస్తే సాయి ఆమె పట్ల బాగా ఇష్టం పెంచుకున్నట్టే తెలుస్తోంది. అయితే వీరిద్దరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పుడు సమంత యంగ్ హీరోలతో నటిస్తోంది. ఈ క్రమంలో అయినా వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందేమో ? చూడాలి.