వెండితెరపై నటీనటులుగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శివబాలాజీ, నటి మధుమిత. 20 సంవత్సరాలు క్రితం మధుమిత టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో కొన్ని సినిమాలలో నటించింది. ఇక శివబాలాజీ.. మధుమిత కలిసి కూడా కొన్ని సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులు ఇద్దరు పిల్లలతో సుఖ సంతోషాలతో ఫ్యామిలీ లైఫ్ గడుపుతున్నారు.
ఇక శివబాలాజీ బిగ్ బాస్ విన్నర్ గా కూడా నిలిచారు. ఇప్పటికీ అటు వెండితెరపై పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఉన్న పాల్గొన్న శివబాలాజీ మధుమిత తమ దాంపత్య జీవితంలో ఏర్పడిన ఒడిదుడుకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తామిద్దరం నాలుగేళ్లుగా ప్రేమించుకున్నామని.. అయితే జాతకాలు కలవనందున ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదని శివబాలాజీ చెప్పాడు.
ఇలా ప్రేమించుకుని పెళ్లి ఫిక్స్ అయ్యాక బ్రేకప్ చెప్పుకున్నామని.. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు మా పెళ్లి జరిగిందని తెలిపాడు. ఇలా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని పెళ్లి చేసుకున్న మా జీవితం సంతోషంగా సాగలేదని.. ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేదని చెప్పాడు. చివరకు ఈ గొడవలు పెరిగి పెద్దవి కావడంతో ఒకానొక దశలో విడిపోవాలని కూడా నిర్ణయించుకున్నామని మధుమతి తెలిపారు.
ఇక శివబాలాజీ మాట్లాడుతూ తన ఎక్కువగా బయట స్నేహితులతో గడిపేందుకు ఇష్టపడే వాడిని.. ఇది ఇంట్లో వారికి నచ్చేది కాదు.. తను బయటికి వెళ్లిన ప్రతిసారి కండిషన్లు పెట్టే వారిని తెలిపాడు. అలా కండిషన్లో పెట్టడంతో ఆ గొడవలు పెరిగి పెద్దవి అయ్యాయని.. ఇక బాబు పుట్టిన తర్వాత కూడా విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. ఆ సమయంలో మా కజిన్ చిన్న సజెషన్ ఇచ్చాడని కూడా స్పష్టం చేశాడు.
మీరిద్దరూ ఒకే చోట కాకుండా విడివిడిగా ఉండండి అని చెప్పడంతో.. మేము ఎవరి ఇంట్లో వాళ్లు ఉన్నామని అయితే ఇద్దరి మధ్య అప్పుడు ఏర్పడిన ఈ దూరాన్ని భరించలేక తిరిగి మాట్లాడాలంటే ఇద్దరికీ ఈగో అడ్డు వచ్చేదని చెప్పాడు. అలా తాము ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేక తిరిగి కలిసిపోయినట్టు శివబాలాజీ చెప్పాడు. అర్థం చేసుకునే విధానం, గౌరవం ఉంటేనే బంధాలు బలంగా ఉంటాయని శివబాలాజీ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.