Moviesలేడీ డైరెక్ట‌ర్ నందినీరెడ్డి పెళ్లికి ఆ స్టార్ హీరోకు అంత లింక్...

లేడీ డైరెక్ట‌ర్ నందినీరెడ్డి పెళ్లికి ఆ స్టార్ హీరోకు అంత లింక్ ఉందా…!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ? టక్కున గుర్తొచ్చే పేరు యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌ది. ఇప్ప‌టికే నాలుగు ప‌దులు దాటేసి… నాలుగున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అవుతున్నాడు ప్ర‌భాస్‌. పెళ్లెప్పుడు అంటే స‌ల్మాన్‌ఖాన్ పెళ్ల‌య్యాక అని కొంటెగా స‌మాధానం ఇస్తూ ఉంటారు. త‌న తోటి హీరోలు ఒక్కొక్క‌రు పెళ్లిళ్లు చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయిపోతున్నా ప్ర‌భాస్ మాత్రం ఇంకా పెళ్లి అన్న ప‌దానికే దూరంగా ఉంటున్నాడు.

పెద‌నాన్న కృష్ణంరాజు ఉండ‌గానే ప్ర‌భాస్‌కు పెళ్లి చేయాల‌ని చూశాడు. కానీ ప్ర‌భాస్ సినిమాలు అంటూ కాలం గ‌డిపేస్తూ వ‌చ్చాడు. ఇక అనుష్క – ప్ర‌భాస్ పెళ్లి గురించి లెక్క‌కు మిక్కిలిగా వార్త‌లు వ‌స్తూనే ఉంటాయి. ఇక ఎవ‌రైనా తెలుగులో పెళ్లి ఎప్పుడు చేసుకుంటార‌న్న ప్ర‌శ్న‌కు ముందు ప్ర‌భాస్ పెళ్లి అవ్వ‌నివ్వండి అని స‌మాధానం ఇస్తున్నారు.

తాజాగా ఇప్పుడు ఓ లేడీ డైరెక్ట‌ర్ కూడా ఇదే షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది. నాని హీరోగా వ‌చ్చిన అలా మొదలైంది సినిమాతో దర్శకురాలు అయిన నందినీరెడ్డి ఆ తర్వాత జబర్దస్త్ – కళ్యాణ వైభోగమే – ఓ బేబి లాంటి సినిమాలు తెరకెక్కించారు. దర్శకురాలిగా త‌న‌దైన ముద్ర వేసుకున్న ఆమె తాజాగా అన్నీ మంచి శకనుములే సినిమా తెర‌కెక్కించారు.

ఇండ‌స్ట్రీలో ఆమెకు చాలా మంది హీరోయిన్లు మంచి స్నేహితులుగా ఉన్నారు. స‌మంత ఆమెకు బెస్ట్ ఫ్రెండ్‌. అందుకే ఆమె ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత రెండు సినిమాలు చేసింది. ఆమె తాజా సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఆమెను మీ పెళ్లి ఎప్పుడు అని ప్ర‌శ్నిస్తే తొంద‌ర ఏం ఉంది.. ముందు ప్ర‌భాస్ పెళ్లి అవ్వ‌నీయండి… ఆ వెంట‌నే నేను కూడా చేసుకుంటాన‌ని చెప్పి ఎస్కేప్ అయ్యింది. ఏదేమైనా బాలీవుడ్ లో స‌ల్మాన్‌ఖాన్‌, నార్త్‌లో ప్రభాస్ పెళ్లిళ్లు ఎప్పుడు జ‌రుగుతాయో తెలియ‌ని ప‌రిస్థితి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news