సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఓ విషయాన్ని బాగా అలవాటు చేసుకున్నారు . సినిమా హిట్ అయినా ఫట్ అయినా .. మీడియాతో ఎక్కువగా ముచ్చటించడం .. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉండడం.. తమ పేరుని మర్చిపోకుండా.. ఉండేలా ట్రై చేస్తున్నారు స్టార్ సెలబ్రిటీస్ . కాగా రీసెంట్గా అదే లిస్టులో కి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. పేరుకు కన్నడ బ్యూటీనే అయినా ..తెలుగులో నటించే అవకాశాలు అందుకున్న కృతి శెట్టి స్టార్ బ్యూటీ గా మారిపోయింది.
ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోవడానికి ట్రై చేస్తుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కృతి శెట్టి చేసిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి . సుధీర్ బాబుతో కలిసి “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”.. నితిన్ తో కలిసి “మాచర్ల నియోజకవర్గం”..రామ్ తో “వారియర్”.. నాగ చైతన్య తో “కస్టడి”.. ఇలా నాలుగు ఫ్లాప్ అవ్వడంతో ఓ ఆట ఆడేసుకుంటున్నారు జనాలు.
అయితే కృతి మాత్రం ఎక్కడా బెదరకుండా అభిమానులకి ఎలా వెళ్తే ఎలాంటి పనులు చేస్తే ఇష్టపడతారో అనే విధంగా వెళ్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనకు కాబోయే భర్త గురించి రివిల్ చేసింది కృతి శెట్టి . తన కాబోయే భర్తకు పెద్దగా ఆస్తి ఉండక్కర్లేదట ..అందంగా కూడా ఎక్కువగా ఉండక్కర్లేదట ..కానీ బొద్దుగా ఉంటే చాలా ఇష్టమట.చభీ చబ్బీ గా బుగ్గలు పెద్దపెద్దగా ఉంటే కృతిశెట్టికి చాలా ఇష్టమట . మంచి మనసు ఉండాలి అని,, ఫైనాన్షియల్ స్టేటస్ బాగో లేకపోయినా కానీ మంచి మనసు ఉంటే ఉంటే అదే ఇష్టముంటుంది కృతిశెట్టి . దీనితో మరోసారి కృతిశెట్టి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!