మహాకవి శ్రీశ్రీ గురించి తెలియని వారు ఉండరు. విజయనగరం జిల్లాకు చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు.. అక్షరాలతోనే కాపురం చేశారు.. కవితలను.. తన బిడ్డలుగా పెంచారు. ఈ విషయాన్ని ఆయనే అనేక సంద ర్భాల్లో చెప్పుకొన్నారు. ఆయన ‘ఈ శతాబ్దం నాది’ అని సగర్వం గా చెప్పుకొన్నారు. శ్రీశ్రీ జీవితచరిత్ర ‘అనంతం’లో అయితే అనేక విషయాలు పంచుకున్నారు. స్కూల్ డేస్ నుంచి వివాహం.. వ్యసనం వరకు కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండానే ముందుకు సాగారు.
ప్రతి పదంలోనూ.. ప్రతి అక్షరంలోనూ.. శ్రీశ్రీ తన జీవితాన్ని కనిపించేలా చేశారు. ఇలా.. తన జీవితం గురించి రాస్తూ.. ఒక చోట నేను మనసు పారేసుకున్న నటి
అని రాసుకొచ్చారు. ఇప్పటి మాదిరిగా.. అప్పట్లో పాటలు రాసేవారు.. నేరుగా షూటింగ్ స్పాట్లకు వెళ్లేవారు కాదు. అసలు.. షూటింగులతోనూ వారికి పెద్దగా సంబంధాలు ఉండేవి కాదు. స్టూడియోలో ఓ మూల కుర్చీ వేసి.. ఓ ఫ్యాను పెట్టవారు. దర్శకుడు తన పీఏ ద్వారా.. కథను పంపించి.. తనకు కావాల్సిన సీన్లో పాట గురించి వివరించవారు.
అంతే… రచయిత పాట రాసిన తర్వాత సంగీత దర్శకుడు ట్యూన్ కట్టేవారు. దీంతో షూటింగుల్లో పాటల రచయితలు.. కవులుపెద్దగా కనిపించేవారు కాదు. అల్లూరి సీతారామ రాజు సినిమా సమయానికి శ్రీశ్రీ మంచంలో ఉన్నారు. అయినా నటశేఖర కృష్ణ మాత్రం ఆయనతో పాటలు రాయించుకుని తర్వాత ట్యూన్ కట్టించుకున్నారు. మరి అలాంటి శ్రీశ్రీ.. నేను మనసు పారేసుకున్న నటి
అని రాసుకోవడం ఏంటి? అనే చిత్రమైన సందేహం వస్తుంది.ఇదే విషయాన్ని ఆయన నాలుగు పంక్తుల్లో తేల్చేశారు. “నేను ఒకసారి.. విజయగార్డెన్లో ఉన్నాను. అక్కడకు ఎవరో నలుగురు అమ్మాయిలు (హీరోయిన్లు) వచ్చారు. వారిలో ఒకామె.. చాలా పొట్టిగా ఉంది. అయినా.. మెరుపుల్లాంటి కళ్లు.. చలాకీ తనం.. నన్ను మంత్రముగ్ధుడిని చేసింది. మనసు చలించింది. తర్వాత తెలుసుకున్నాను.. ఆమె భానుమతట..!
మరో రోజు వెళ్లాను కనిపించలేదు. ఒకసారి చలం(రచయిత) నా దగ్గర అన్యాపగా ఆమె
గురించి ప్రస్తావించి.. గొప్ప పాటకారి అన్నాడు. నవ్వాను. ఎందుకో.. తెలియదు.. మనసు అలా స్పందించింది.. యథావిథంగా నా రూంలోకి వెళ్లిపోయాను“ అని రాసుకొచ్చారు.