టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుని.. సినీ ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో షేక్ చేసేస్తున్నాడు . ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ .. ప్రజెంట్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ ధర్టీ అనే సినిమాలో నటిస్తున్నాడు . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ధీమ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు ఈ సినిమా నెక్స్ట్ షూటింగ్ రేపటి నుంచి రామోజీ ఫిలిం సిటీ లో స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే భారీ సెట్ వేసి మరి ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట . అంతేకాదు హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ని రంగంలోకి దింపాడు కొరటాల అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఈ స్టంత్స్ యాక్షన్స్ సీన్స్ అన్ని తారక్ డూప్ లేకుండా నటిస్తున్నాడు అంటూ ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు దీనికోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న తారక్ సపరేట్ డైట్ కూడా ఫాలో అయ్యారట .
ఏది ఏమైనా సరే చిన్న రిస్కీ షాట్ లనే డుప్స్ పెట్టుకుంటున్న స్టార్ హీరోలు ఉన్న మన ఇండస్ట్రీలో ఇలాంటి హాలీవుడ్ స్థాయి భారీ యాక్షన్ సీన్స్ లో కూడా ఒరిజినల్ గా డూప్ లేకుండా తారక్ నటిస్తున్నాడు అంటే నిజంగా గ్రేట్ ..అది అభిమానులపై ఉన్న ప్రేమ నమ్మకమనే చెప్పాలి . దీంతో ఈ సినిమాపై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్టే చేస్తున్నారు నందమూరి అభిమానులు . ఈ సినిమాలో జాన్వి కపూర్ ఆల్రెడీ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది . సెకండ్ హీరోయిన్గా రష్మిక మందన -మృణాల్ ఠాకూర్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!