Moviesకమెడియన్ విజయ్ ఆత్మహత్య! కారణం అదేనా ..?

కమెడియన్ విజయ్ ఆత్మహత్య! కారణం అదేనా ..?

తెలుగు తెర మీద మరో హాస్య నటుడు అస్తమించాడు. విభిన్న దర్శకుడు రవి బాబు తెరకెక్కించిన అమ్మాయిలు- అబ్బాయిలు సినిమా ద్వారా బాగా ఫేమస్ అయిన విజయ్ సాయి హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బొమ్మరిల్లు సినిమా లో ఆయన పాత్రకు మంచి పేరు వచ్చింది. అయితే అనుకోకుండా విజయ్ సాయి ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిచివేస్తోంది.
విజయ్‌కు ఆర్థిక పరమైన ఇబ్బందులే కాకుండా కుటుంబ సమస్యలు కూడా ఉండడం వంటి  ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యూసుఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 విజయ్ కి భార్య ఒక కుమార్తె ఉన్నారు. కొంతకాలం క్రితం వీరి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో  విడాకులు తీసుకున్నారు. వారికి ఒక పాప ఉంది. విడాకుల అనంతరం పాప భార్య సంరక్షణలోనే ఉంది. అయితే పాపను  చూసేందుకు కూడా భార్య అనుమతించకపోవడంతో విజయ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాదనే కారణాలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగులో బొమ్మరిల్లు, మంత్ర, ఏకలవ్యుడు, ఇందుమతి, నా గాళ్‌ఫ్రెండ్ బాగా రిచ్ వంటి చిత్రాల్లో కమెడియన్‌గా నటించిన విజయ్ అందరి అభినందనలు అందుకున్నాడు. విజయ్ ఆత్మహత్యపై తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news