ప్రజెంట్ ఇండస్ట్రీలో నాగచైతన్య పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ బాగా తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చిన కొత్తలో ఎంత పాపులర్ అయ్యాడో.. పెళ్లి చేసుకున్నాక ఎంత పబ్లిసిటీ సంపాదించుకున్నాడో తెలియదు కానీ.. విడాకులు తీసుకున్నాక మాత్రం నాగచైతన్య ఓ రేంజ్ లో తన పేరుకి పబ్లిసిటీ దక్కించుకొని హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాడు . ట్రోలింగ్కి గురవుతున్నారు . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఎందుకు విడాకులు తీసుకున్నానో ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.
అంతేకాదు గతంలో ఎప్పుడు సమంతపై చేయని కామెంట్స్ కూడా చేశాడు. సమంతలో నాకు ఇదే ఇష్టమని.. ఆమె చాలా హార్డ్ వర్క్ అని.. మొండిదని అనుకున్నది సాధించి తీరుతుంది అని ..చెప్పుకొచ్చాడు . నాగచైతన్య పై పాజిటివ్ మైండ్ సెట్ ఏర్పరచుకున్నారు . ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య కస్టడీ సినిమా టాక్ వైరల్ అవుతుంది. నాగచైతన్య కస్టడి సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . ఈ సినిమాకి శివ క్యారెక్టర్ చాలా ప్లస్ గా మారింది . అంతే కాదు శివ క్యారెక్టర్ లో ఇమిడిపోయినటించాడు నాగచైతన్య అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అంతే రేంజ్ లో రేవతి పాత్రలో కూడా కృతి శెట్టి ఒదిగిపోయి నటించింది . వీళ్ల లవ్ స్టోరీ చాలా బాగా వర్క్ అవుట్ అయిందని .. వీళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా సూపర్ గా ఉందని .. ఏం మాయ చేసావే లో నాగచైతన్య – సమంతల తర్వాత కృతిశెట్టి – నాగచైతన్య పర్ఫామెన్స్ ఆ రేంజ్ లో ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు వీళ్ళిద్దరి పేర్లు ఏదో తెలియని మ్యాజిక్ ఉందని .. వీళ్లిద్దరు జతకట్టిన ప్రతిసారి సినిమా హిట్ అవుతుందని.. నాగచైతన్యకు లక్కీ హీరోయిన్గా కృతి శెట్టి మారిపోబోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు.
ఒకప్పుడు నాగచైతన్యకి సమంత ఎలా లక్కీగా ఉందో .. ఇప్పుడు కృతి శెట్టి అంతే లక్కీగా మారిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోని కృతి శెట్టి – సమంత ప్లేని రీప్లేస్ చేస్తుంది అంటూ కూడా జనాలు కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఒకసారి కృతిశెట్టి – నాగచైతన్యల రొమాంటిక్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . చూద్దాం మరి దీనిపై ఇద్దరు జంట ఏ విధంగా స్పందిస్తారో..?