నందమూరి హీరోల్లో తనకంటూ ఒక డిఫ్రెంట్ మేనరిజాన్ని కలిగి ఉన్న హీరో ఎవరన్నా ఉన్నారా అంటే అది కచ్చితంగా కళ్యాణ్ రామ్ అనే చెప్పాలి. బాల నటుడిగా 1989 లో బాలకృష్ణ నటించిన బాలగోపాలుడు మూవీ లో బాల నటుడిగా రంగప్రవేశం చేసిన హీరోగా మాత్రం తన కెరీర్ ని 2003 లో తొలిచూపులోనే మూవీ తో స్టార్ట్ చేసాడు .ఇప్పటి వరకు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుని సరికొత్త అవకాశాలను సృష్టించుకుంటున్నాడు. కానీ ఈ మధ్య ఆయనకు సినిమాలు పెద్దగా కలిసిరాకపోయినా… అవకాశాలు అయితే బాగానే వస్తున్నాయి.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇజం’అంతకుముందు మల్లికార్జున్ దర్శకత్వంలో నటించిన ‘షేర్’ డిజాస్టర్లయ్యాయి. ఐతే ఈ ప్లాప్ లు ఏవీ ఆయన అవకాశాలను అయితే దెబ్బతీయలేదు. వరుసపెట్టి అవకాశాలు వస్తుండడంతో ఇప్పుడు వరుసబెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. ఈ నందమూరి హీరో ఉపేంద్ర అనే కొత్త దర్శకుడితో ‘ఎమ్మెల్యే’ అనే సినిమాతో పాటు ‘180’ ఫేమ్ జయేంద్ర డైరెక్షన్లో ఇంకో సినిమా చేస్తున్నాడు. ఇవి నిర్మాణం పూర్తిచేసుకోబోతుండగానే మళ్ళీ రెండుమూడు సినిమాల వరకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
మలయాళంలో సూపర్ హిట్టయిన ‘రామ్ లీలా’ రీమేక్ ప్రపోజల్ కళ్యాణ్ రామ్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది కాక రెండు నిర్మాణ సంస్థలకు కళ్యాణ్ రామ్ కమిట్మెంట్లు ఇచ్చినట్లు వరఃతలు వస్తున్నాయి. ‘అష్టాచెమ్మా’.. ‘గోల్కొండ హైస్కూల్’.. ‘ఉయ్యాల జంపాల’ లాంటి సినిమాల్లో నిర్మాణ భాగస్వామిగా ఉన్న మల్టీ డైమన్షన్ పిక్చర్స్ అధినేత రామ్మోహన్ ప్రొడక్షన్లో ఒక సినిమాతో పాటు కోన వెంకట్ భాగస్వామ్యంలో తెరకెక్కనున్న మరో సినిమాకు కళ్యాణ్ రామ్ ఒకే చెప్పేశాడట.
త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. గతంలో సొంత బేనర్లోనే సినిమాలు చేసుకుంటూ వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమాలు బాక్సపీస్ దగ్గర బోల్తా పడినా అవేవి పట్టించుకోకుండా అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. ఎంతైనా నందమూరి హీరో కదా ఆ క్రేజ్ అలాగే ఉంటుంది అందులో సందేహమే లేదు.